మోడీని మోసం చేసిన గూగుల్

Update: 2016-02-13 07:03 GMT
 అన్ని దేశాల అధినేతలతో నిత్యం టచ్ లో ఉంటున్న ప్రధాని మోడీ... వారి పుట్టిన రోజులు - పెళ్లి రోజులు - ఆయా దేశాల స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా వారికి శుభాకాంక్షలు చెబుతూ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా ఆయన ఆఫ్గన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి శుక్రవారం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెబుతూ సందేశం పంపించారు. అయితే... ఆ తరువాతే అసలు విషయం తెలిసింది. ఘనీ పుట్టిన రోజు ఫిబ్రవరి 12 కాదట... మే 19న ఆయన జన్మదినం. ఈ సంగతి ఘనీయే స్వయంగా వెల్లడించారు మోడీ చెప్పిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు చెప్పిన ఆయన అసలు సంగతి కూడా తెలిపారు.

మరి... ఈ పొరపాటు ఎలా జరిగిందన్నది ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. మోడీ టీం ఇలా ట్విట్టర్ ఆధారంగా దేశాధినేతలకు శుభాకాంక్షలు చెబుతుంది. వారు గూగుల్ ఆధారంగానే ప్రపంచ ప్రముఖుల జన్మ తేదీలు తెలుసుకుని ఆ రోజుల్లో శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే... గూగుల్ లో ఘనీ పుట్టిన రోజు తప్పుగా ఉండడంతో ఈ పొరపాటు జరిగినట్లు చెబుతున్నారు.  మొత్తానికి గూగుల్ పొరపాటుతో మోడీ ట్విట్టర్ కోడి ముందే కూసింది.
Tags:    

Similar News