అనుకున్న పనిని పూర్తి చేయటంలో ఫెయిల్యూర్ ను మోడీషాలు యమా సీరియస్

Update: 2021-02-17 12:43 GMT
టార్గెట్ చేస్తే చాలు.. రాష్ట్రం ఏదైనా సరే.. కాషాయ జెండా ఎగరాల్సిందే. అందుకోసం ఎంతకైనా సై అంటారన్న విషయం కర్ణాటక.. మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల విషయంలో ఇప్పటికే నిరూపించుకున్నారు మోడీషాలు. తాజాగా వారి కన్ను పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం మీద పడినట్లుగా చెబుతున్నారు. దక్షిణాదిలో ఎంత ప్రయత్నించినా.. కర్ణాటక తప్ప మరే రాష్ట్రం వారి అధీనంలోకి వెళ్లకపోవటం.. కనుచూపు మేర అలాంటి పరిస్థితి లేకపోవటం.. మరోమూడు.. నాలుగు నెలల్లో తమిళనాడు..పశ్చిమబెంగాల్.. కేరళ.. అసోంతో సహా పుదుచ్చేరికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఇలాంటివేళ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో కాషాయ జెండా ఎగరాలంటే అందుకు జరపాల్సిన మంత్రాంగం వేరుగా ఉంటుంది.

అందుకే.. ఇంతకాలం నెత్తిన పెట్టుకొని వచ్చిన కిరణ్ బేడీనిక గవర్నర్ పదవి నుంచి తప్పిస్తూ రాష్ట్రపతి కార్యాలయం కీలక ప్రకటన చేసింది. పుదుచ్చేరిలో రాజకీయ అనిశ్చితి పెరిగితే.. ఇందుకు ఏ మాత్రం సంబంధం లేని గవర్నర్ ను ఎందుకు మార్చారు? అన్నది ఆసక్తికరంగా మారింది. సమర్థురాలైన అధికారిణిగా.. ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు చెక్ పెట్టటమే కాదు.. ఆయనకు ఇరిటేషన్ తెప్పించటం.. చివరకు గవర్నర్ బంగ్లా ఎదుట నిరసన వెళ్లే వరకు విషయం వెళ్లింది. అయినప్పటికి ఆమె మీద ఈగ వాలకుండా ఉన్న పరిస్థితి నుంచి.. అనూహ్యంగా ఆమెను అప్పటికప్పుడు తప్పిస్తూ రాష్ట్రపతి భవన్ నిర్ణయం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది.

ఇంతకూ కిరణ్ బేడీ లాంటి సమర్థురాలైన మహిళను ఎందుకు తప్పించినట్లు? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి మూడు కారణాల్నిపలువురు ప్రస్తావిస్తున్నారు. అందులో మొదటిది కీలకమైనది.. అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరిగే వేళ.. పార్టీ లైన్ తో పాటు.. వ్యూహాల్ని పక్కాగా అమలు అయ్యే రాజకీయ వేత్తను నియమించాలన్న ఉద్దేశంతోనే తాజా మార్పుగా చెబుతున్నారు. ఒకవేళ.. ఎన్నికల్లో అనుకున్నంత మెజార్టీ రాకుంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే వ్యక్తిని ఎంపిక చేయటంలో తడబాటుకు గురి కాకుండా ఉండేందుకే అని చెబుతున్నారు. రెండో కారణం ఏమై ఉంటుందన్న ప్రశ్నకు సమాధానం ఆసక్తికరంగా ఉంది.

ఎన్నికల్లో మాజీ సీఎం రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలన్న యోచనలో బీజేపీ ఉన్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే.. కిరణ్ బేడీ ఉంటే అస్సలు సాధ్యం కాదు. ఇప్పటికే ఉప్పు..నిప్పులా ఉండే వీరిద్దరి మధ్య సయోధ్య చాలా  కష్టం. అందుకే ముందుచూపుతో ఆమెను మార్చినట్లుగా చెబుతున్నారు. ఇక.. మూడో కారణం.. మోడీషాలు ఇచ్చిన టార్గెట్ ను సరిగా పూర్తి చేయలేకపోయారని చెబుతున్నారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాల్ని వెలుగులోకి తేవాలని ప్రయ్నించినా అది సాధ్యం కాలేదంటున్నారు. దీనికి కారణం కిరణ్ బేడీనే అంటున్నారు. ఎందుకంటే.. లెఫ్టెనెంట్ గవర్నర్ గా అవకాశం ఇచ్చినప్పుడు.. ఆమె ఏం చేయాలన్న విషయంపై స్పష్టంగా చెప్పినట్లు చెబుతారు. అయితే.. ఆమె ఆ పనిని వదిలేసి.. ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాలపై ఎక్కువ ఫోకస్ పెట్టటం కూడా మోడీషాలకు నచ్చలేదంటారు. ఈ కారణం కూడా ఆమెనుతప్పించటంలో కీలకభూమిక పోషించిందన్న మాట వినిపిస్తోంది.ఇదంతా చూసినప్పుడు వైఫల్యాన్ని మోడీషాలు ఎంత సీరియస్ గా తీసుకుంటారో ఇట్టే అర్థం కాక మానదు.
Tags:    

Similar News