‘చంద్రన్న’ వేస్టన్న సొంత ఎమ్మెల్యే

Update: 2017-05-02 07:06 GMT
రాష్ర్ట విభజనకు ముందు సమైక్యాంధ్ర కోసం పార్లమెంటులో పోట్లాడిన అప్పటి టీడీపీ ఎంపీ - ప్రస్తుత ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మ‌రోసారి చంద్ర‌బాబు ప‌థ‌కాల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. చంద్ర‌న్న బీమా ప‌థ‌కం వేస్ట్ అని మేడే రోజు వ్యాఖ్యానించి క‌ల‌క‌లం రేపారు.
    
చంద్ర‌న్న బీమా ప‌థ‌కం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అమ‌లు కావ‌డం లేద‌న్నారు. మంత్రులు ప‌త్తిపాటి పుల్లారావు - న‌క్కా ఆనంద‌బాబు స‌మ‌క్షంలోనే మోదుగుల ఈ వ్యాఖ్య‌లు చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలోని భ‌జ‌రంగ్ జూట్ మిల్ కార్మికులు 1500 మంది ఉన్నార‌ని , గుంటూరు న‌గ‌రంలోని హోట‌ళ్ల‌లో బాల‌కార్మికులు అధికంగా ఉన్నార‌ని కానీ వారి గురించి ప‌ట్టించుకునే వారు ఎవ‌ర‌ని మోదుగుల ప్ర‌శ్నించారు. చంద్ర‌న్న బీమా వల్ల కార్మికుల‌కు ఒరిగిందేమీ లేద‌ని వ్యాఖ్యానించారు.
    
కాగా మోదుగుల కొద్దికాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ తనను వాడుకుని వదిలేసిందనే భావనలో ఉన్నారు. అంతే కాదు.. గుంటూరు జిల్లాలో ఆయన మాట సాగకపోవడంతో మండిపడుతున్నారు. దీంతో తరచూ ఆయన చంద్రబాబుపై మరోసారి విమర్శలు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News