కొట్టుకోవడం ఒక్కటే తక్కువ.. లంక్​ ప్రీమియర్​ లీగ్​లో రెచ్చిపోయిన ఆటగాళ్లు

Update: 2020-12-02 02:45 GMT
ప్రస్తుతం శ్రీలంకలో ఎల్​పీఎల్​ (లంకప్రీమియర్​ లీగ్​) జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం కాండీ టస్కర్స్​, గాలే గ్లాడియటర్స్​ మధ్య జరిగింది. ఈ ఇన్సింగ్స్​లో ఆటగాళ్లు సహనం కోల్పోయారు. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు.  ఒకరిమీదకు మరొకరు వెళుతూ రచ్చ రచ్చచేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..
సోమవారం నాటి ఈ  మ్యాచ్‌లో కాండీ టస్కర్స్‌ గాలే గ్లాడియేటర్స్‌పై 25 పరుగుల తేడాతో గెలిచింది.

అయితే గ్లాడియేటర్స్‌ బ్యాటింగ్​ చేస్తున్నప్పుడు టస్కర్స్‌ బౌలర్‌ నవీన్‌ హుల్‌ హక్‌ తిట్ట దండకం అందుకున్నాడు. మహ్మద్‌ ఆమిర్‌ బ్యాటింగ్​ చేస్తున్నప్పుడు.. నవీన్​ బూతులు తిట్టాడు. ఓ దశలో ఇద్దరు కొట్టుకుంటారేమోనన్నంత ఘర్షణ వాతావరణం నెలకొన్నది. అయితే మ్యాచ్​ ముగిసిన అనంతరం ఇరు జట్లు షేక్​ హ్యాండ్లు ఇచ్చుకొనేటప్పుడు కూడా గొడవ సద్దుమణగలేదు.  మ్యాచ్‌ ముగిశాక గ్లాడియేటర్స్‌ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది ప్రత్యర్థి జట్టు క్రీడాకారులకు షేక్​ హ్యాండ్​ ఇస్తున్నాడు. ఈ క్రమంలో బౌలర్​ నవీన్​కు షేక్​ హ్యాండ్​ ఇచ్చేటప్పుడు అఫ్రిదీ అతడితో వాదనకు దిగాడు.


‘ఏమైంది నీకు.. ఓ సీనియర్​ బౌలర్​తో అలాగేనా ప్రవర్తించేది. ఇది చాలా తప్పు అంటూ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన కాండీ టస్కర్స్‌ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్లాడియేటర్స్‌ 171 పరుగుల వద్దే ఆగిపోయింది.
Tags:    

Similar News