టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కమ్ పొలిటీషియన్ మొహమ్మద్ అజహరుద్దీన్ కు దిమ్మ తిరిగిపోయే షాక్ తగిలింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవిని చేపట్టాలన్న ఆశతో నామినేషన్ వేసిన ఆయనకు ఆదిలోనే హంశపాదులా మారింది. ఆయన వేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారులు తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అజ్జూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
క్రికెటర్ గా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అజహరుద్దీన్ పై బీసీసీఐ 2000లో జీవితకాలం నిషేధం విధించింది. అనంతరం.. 12 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు.. బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ.. ఆయన నిర్దోషిగా తేలుస్తూ తీర్పును ఇచ్చింది. అయినప్పటికీ బీసీసీఐ ఆయనపై విధించిన నిషేధాన్ని ఎత్తేయలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా నామినేషన్ దాఖలు చేసిన అజహరుద్దీన్ తనపై విధించిన జీవితకాలం నిషేధంపై ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవటంతో ఆయన నామినేషన్ ను తిరస్కరించినట్లుగా చెబుతున్నారు. ఈ పదవికి అజహరుద్దీన్ తో పాటు.. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్.. జయసింహ రేసులో ఉన్నారు. ఈ నెల 17న జరగనున్న ఈ ఎన్నికలు..తాజాగాచోటు చేసుకున్న పరిణామంతో ఆసక్తికరంగా మారాయి. తన నామినేషన్ ను రిజెక్ట్ చేయటంపై అజ్జూ స్పందిస్తూ.. న్యాయపోరాటానికి దిగుతానని చెబుతున్నట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/