మా ఎన్నికల తర్వాత నటుడు మోహన్‌బాబు ఎమ్మెల్యే బాలకృష్ణను కలిశారు. కలిసి ఊరుకున్నారా? బాలయ్యపై ప్రశంసలు కురిపించారు. బాలయ్య గొప్పతానాన్ని కొనియాడారు. అంతవరకు బాగానే ఉంది. మోహన్‌బాబు ప్రశంసలతో ఆగింటే అసలు లొల్లేలేదు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాలయ్య బాబు, అల్లుడి (లోకేష్)ను ఓడించడానికి ప్రచారం చేశానని, అన్నీ మరిచిపోయి బాలకృష్ణ ఓటేశారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని మోహన్‌బాబు అన్నారు. ఇక్కడే అసలు కథ మొదలైంది.
బాలయ్యపై ప్రశంసలు కురిపించడంలో టీడీపీకి ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా వైసీపీకి మద్దతుదారుడైన మోహన్‌బాబు, బాలయ్యను కొనియాడడం ఆ పార్టీ నేతలకు సంతోషమే. అయితే మా ఎన్నికల్లో జరిగిన రచ్చపై టీడీపీ ఎక్కడా జోక్యం చేసుకోలేదు. తెరవెనుక మంచు విష్ణు ప్యానల్‌కు బాలకృష్ణ సపోర్టు చేస్తున్నారని తెలిసినా ఆ పార్టీ పట్టించుకోలేదు. సినిమా విషయాల్లో తలదూర్చడం ఎందుకులే అనుకున్నారో ఏమో మౌనంగా అన్ని గమనించారనే తప్ప ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.
మా ఎన్నికల్లో విష్ణు విజయం సాధించిన తర్వాత మద్దతు ఇచ్చిన సినీ పెద్దలను మోహన్‌బాబు, విష్ణు కలిశారు. ఈ క్రమంలోనే బాలకృష్ణను కూడా కలిశారు. కలిసిన తర్వాత మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీని ఇరుకున పెడుతున్నాయని చెబుతున్నారు. బాలయ్య తన కుమారుడికి మద్దతు ఇవ్వడం మంచి పరిణామని మోహన్‌బాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీలో విపరీతమైన చర్చ జరుగుతోంది. లోకేష్‌ను ఓడించేందుకు ప్రచారం చేశానని మోహన్‌బాబు గుర్తు చేయడం టీడీపీకి మింగుడు పడలేదు. పాత విషయాన్ని ఎందుకు ప్రస్తావించారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. మోహన్‌బాబు అనుకోకుండా ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవడం లేదని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులు కుదుర్చునేందుకు అడుగులు వేస్తున్నాయి. మెగా ఫ్యామిలీకి మరీ ముఖ్యంగా జనసేనాని పవన్‌కు ఆగ్రహం తెప్పించేలా మోహన్‌బాబు వ్యాఖ్యలు ఉన్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది. బాలకృష్ణ సినీ రంగానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదు ఆయన హిందూపురం ఎమ్మెల్యే కూడా. ఇలాంటి సమయంలో పవన్‌కు కాపు సామాజికవర్గానికి ఆగ్రహం కల్గించేలా మోహన్‌బాబు వ్యాఖ్యలున్నాయని టీడీపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారంట.