ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు జగన్ పార్టీ తరఫున ప్రచారం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వాన్ని.. బాబు పాలనను తన మాటలతో చీల్చి చెండాతున్న ఆయన తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో బాబు సర్కారు కారణంగా ఏపీ ప్రజలు భారీగా నష్టపోయినట్లుగా ఆయన తప్పు పట్టారు.
మట్టి దగ్గర నుంచి రాష్ట్ర నిర్మాణం కోసం వచ్చిన లక్ష కోట్ల రూపాయిలు మురిగిపోయినట్లుగా ఆరోపించిన మోహన్ బాబు.. చంద్రబాబు ఐదేళ్ల పాలన మొత్తం దోచుకో.. దాచుకో అన్నట్లుగానే సాగిందన్నారు. బాబుకు ఓట్లు వేస్తే మురిగిపోతాయని చెప్పిన ఆయన.. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయినట్లుగా ఎద్దేవా చేశారు. టీడీపీకి వేసే ఓట్లు మురిగిపోతాయని మండిపడిన ఆయన.. అలాంటి వ్యక్తికి మరోసారి అధికారాన్నిచేతికి ఇస్తే.. ఆంధ్రులకు అధోగతేనని తప్పు పట్టారు.
చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని కొన్ని పార్టీలు వచ్చాయని.. వాటిని నమ్మొద్దన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని.. ఆయనంత మోసగాడు రాష్ట్రంలోనే ఎవరూ లేరన్నారు. రాజన్న రాజ్యంరావాలంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.
సైకిల్ కు స్టాండ్ లేదని.. ఇంట్లో ఏసీ ఉన్నా ఫ్యానే కావాలంటూ జగన్ పార్టీ అభిమానుల్ని ఉత్సాహపరిచారు. ఆరోగ్య శ్రీ.. ఉద్యోగ అవకాశాలు.. పిల్లల చదువులు.. ఇలా నవరత్నాలు కావాలంటే జగన్ కు ఓటు వేయాల్సిందేనన్నారు. చంద్రబాబు ఇష్టానుసారం కేంద్రంతో వ్యవహరిస్తారంటూ తప్పు పట్టిన మోహన్ బాబు.. బీజేపీతో కొంతసేపు.. కాంగ్రెస్ తో కొంత సేపు సహజీవనం చేసిన ఆయన.. ఆంధ్రుల్ని ఆట వస్తువులగా ఉపయోగించుకున్నారన్నారు.
బీజేపీతో స్నేహం చేసిన రోజులన్ని ప్రత్యేక హోదా కనిపించలేదని.. ఇప్పుడు మాత్రం హోదా అంటూ తిడుతున్నట్లుగా మండిపడ్డారు. ఏపీలో కులపిచ్చిని రాజేసిన చంద్రబాబు.. పత్రికలు.. టీవీలను తన చేతిలో పెట్టుకొని భజన చేయించుకుంటున్నట్లు విమర్శించారు. నిత్యం జగన్ పై కేసుల గురించి మాట్లాడే చంద్రబాబు.. తన మీద ఉన్న కేసుల సంగతిని చెబితే బాగుంటుందన్నారు. నిప్పు కణిక లాంటి మాటలతో విరుచుకుపడుతున్న మోహన్ బాబు కారణంగా చంద్రబాబుకు డ్యామేజ్ ఖాయమన్న మాట వినిపిస్తోంది.