తెలంగాణలో ఇంటర్మీడియేట్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయి. ఫెయిల్ అయ్యామన్న బాధతో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో పాటు చాలా మంది తల్లిదండ్రులు - విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యార్థి సంఘాలు పోరుబాటు పట్టాయి. రాజకీయ నేతలు అవకాశంగా మలుచుకొని అధికార పక్షాన్ని కడిగేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. రాజకీయ ప్రముఖలందరూ కేసీఆర్ సర్కారును కార్నర్ చేశారు. అంతా ఓకే కానీ తాజాగా ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై లేట్ గానైనా లేటెస్ట్ గా మోహన్ బాబు విడుదల చేసిన ప్రకటన మాత్రం ఆసక్తి రేపుతోంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ మోహన్ బాబు తన విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థులకు చంద్రబాబు స్కాలర్ షిప్ లు ఇవ్వలేదని రోడ్డెక్కడం.. నానా రభస చేసి వార్తల్లో నిలిచారు. అది కాస్తా అధికార టీడీపీ - మోహన్ బాబు మధ్య వైరానికి దారితీసింది. టీడీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు మోహన్ బాబు వైసీపీలో చేరి విమర్శలు గుప్పించారు. విద్యార్థుల కోసం రోడ్డెక్కిన మోహన్ బాబుకు మంచి మార్కులే పడ్డాయి.
కానీ పక్క రాష్ట్రం విద్యార్థులపై ప్రేమను చూపిన మోహన్ బాబు తాను నివాసం ఉంటున్న తెలంగాణలో విద్యార్థులు చనిపోతే పట్టించుకోరా అని సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగే నడిచింది. కేసీఆర్ అంటే భయపడుతున్నారని.. అందుకే మోహన్ బాబు స్పందించలేదని ఆడిపోసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ట్రోలింగ్ లకు స్పందించిన మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ‘కేసీఆర్ అంటే తమకు భయం లేదని క్లారిటీ ఇచ్చాడు’. సినిమా వాళ్లు కేసీఆర్ అంటే భయపడుతున్నారు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని.. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని విష్ణు క్లారిటీ ఇచ్చారు. ఇంటర్మీడియెట్ ఫలితాల విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని.. భవిష్యత్ లో మళ్లీ తప్పు జరగకుండా చూసుకోవాలని విష్ణు సూచించారు. తనకు కేటీఆర్ తెలుసునని.. ఆయన చురుకైన - సమస్యలపై వేగంగా స్పందించే నాయకుడని.. కేసీఆర్ ఫైర్ బ్రాండ్ అనే విషయం కాదనడం లేదని విష్ణు చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే.. అసలు తప్పు ఎక్కడ జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.
విష్ణు వివరణ సరిపోలేదు.. మోహన్ బాబే స్పందించాలని అంతా కోరుకున్నారు. అన్నట్టే మోహన్ బాబు స్పందించారు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు.. అనుకూలంగానే ప్రకటన ఉంది. పరీక్షలో తప్పామనో.. మార్కులు రాలేదనో తనువులు చాలించవద్దని విద్యార్థులను కోరాడు. ఒక విద్యాసంస్థ అధినేతగా వేలమంది విద్యార్థినీ విద్యార్థులను కాపాడుతున్న తనకు తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు కలిచివేశాయని పేర్కొన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం స్పందించిందని.. తప్పు చేసిన వారిని శిక్షిస్తుందని.. దయచేసి పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మోహన్ బాబు సూచించారు.
ఇలా మోహన్ బాబు ఏపీలో బాబుకు వ్యతిరేకంగా గళమెత్తితే.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ సర్కారును వెనకేసుకొచ్చినట్టు స్పందించారు. కర్ర విరగకుండా..పాము చావకుండా మోహన్ బాబు కేసీఆర్ కు ట్రీట్ మెంట్ ఇచ్చాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా మోహన్ బాబు ‘ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల’పై చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.