న‌కిలీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న కోటి మంది..!

Update: 2019-07-09 04:55 GMT
మీది శాంసంగ్ ఫోనా. అయితే మీరు త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే. ఒక‌వేళ శాంసంగ్ ఫోన్ కాకున్నా.. ఇలాంటి మోసాల బారిన ప‌డే ప్ర‌మాదం పొంచి ఉన్న నేప‌థ్యంలో ఏం జ‌రిగిందో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. శాంసంగ్ ఫోన్ల‌ను వినియోగించే వారిలో దాదాపు కోటి మంది ఒక న‌కిలీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న షాకింగ్ నిజం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఫోన్ ను అప్ డేట్ కోసం ఒరిజిన‌ల్ స్థానే న‌కిలీ ఉప‌యోగించారు. గూగుల్ ప్లే స్టోర్ లో క‌నిపించిన ఆప్ డేట్ ఫ‌ర్ శాంసంగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇది వినియోగ‌దారుల నుంచి అక్ర‌మ ప‌ద్ద‌తుల్లో డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న విష‌యాన్ని సైబ‌ర్ సెక్యురిటీ సంస్థ సీఎస్ ఐఎస్ వెల్ల‌డించింది.

అప్ డేట్ కోసం అడిగిన‌ప్పుడు డ‌బ్బులు వ‌సూలు చేసే ఈ యాప్.. అందుకు త‌గ్గ‌ట్లు అప్ డేట్స్ డౌన్ లోడ్ కావ‌ట్లేద‌న్న విష‌యాన్ని ప‌లువురు త‌మ రివ్యూల్లో పేర్కొంటున్నారు. ఈ యాప్ ను ప‌రిశీలించిన వారు.. దీన్ని న‌కిలీ యాప్ గా గుర్తించారు. అన‌ధికార అప్ డేట్స్.. ప్యాకేజీల అప్ డేట్స్ కోసం గూగుల్ ప్లే స‌బ్ స్క్రిప్ష‌న్ ను వినియోగించుకోకుండానే డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న‌ట్లుగా గుర్తించారు.

ప్ర‌స్తుతం ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొల‌గించారు. ఎక్కువ‌గా ప్ర‌క‌ట‌న‌లు ఉండే ఈ యాప్ కార‌ణంగా ఫోన్ల‌లోకి ఏదైనా మాల్ వేర్ చేరిందా? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త రాలేదు. అధికారిక అప్ డేట్స్ కోసం ప్ర‌య‌త్నించే వారు థ‌ర్డ్ పార్టీల‌పై ఆధార‌ప‌డొద్ద‌ని.. ఫోన్ లోని సెట్టింగ్స్ తో ఆప్ డేట్స్ తీసుకోవాల‌ని చెబుతున్నారు. తాజా ఎపిసోడ్ లో శాంసంగ్ ఫోన్ లోని సెట్టింగ్స్‌ -> ఎబౌట్‌ ఫోన్‌ -> సాఫ్ట్‌ వేర్‌ అప్‌ డేట్‌ లోకి వెళ్లి ఏవైనా కొత్త అప్‌ డేట్స్‌ ఉన్నాయోమోనని చెక్‌ చేసి డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని చెబుతున్నారు. ఎందుకైనా మంచిది మీరు వాడేది శాంసంగ్ ఫోన్ అయితే.. దాని ఆప్ డేట్ కోసం వినియోగిస్తున్న యాప్ ను ఒక్క‌సారి చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది సుమా!
Tags:    

Similar News