నీడ కూడా పడకూడదు... మనలో చాలామందికి ఏదో ఫ్లోలో లాంటి మాటలు వచ్చేస్తుంటాయి! అంతమాత్రాన నిజంగానే నీడ పడితే అదేదో నేరంగా పరిగణించడం కరెక్టా చెప్పండీ..? కానీ మాస్కోలో పరిస్థితి ఇలానే ఉందండీ బాబూ. అక్కడ నీడ కూడా హద్దు దాటి బయటకి రాకూడదు...! పక్కనున్న వాహనాన్ని, దానికి పక్కనున్న డివైడర్ ని చూసుకుని వాహనం నడపాలి కానీ.. ఆఖరికి సూర్యుడు ఏ దిక్కున ఉన్నాడో కూడా చూసుకుని మరీ వాహనాలు నడపాల్సి వస్తే.. అల్ రెడీ వచ్చింది.. జరిమానా కూడా కట్టేశారు!
ట్రాఫిక్ నిబంధనల్ని అతిక్రమించినా, పరిమితికి మించిన వేగంతో వాహనాన్ని నడిపినా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. ఎక్కడైనా జరిగేదే ఇది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి కాబట్టి ఇలాంటి నిబంధనలు అవసరమే. కానీ, రోడ్డు మీద వెళ్లుతున్న వాహనం నీడ హద్దు దాటిందని జరిమానా విధిస్తే టూ మచ్ కదా. ఇలాంటి ఘటన మాస్కోలో చోటు చేసుకుంది. మాస్కోలోని రింగ్ రోడ్డుపై ఓ కారు వెళ్తుండగా... రోడ్డు పక్కన ఉన్న మార్జిన్ లైన్ దాటి దాని నీడ పడింది. అదే నేరమైంది! ఆ విషయాన్ని సీసీ కెమెరాలు గుర్తించాయి. కారు నీడ లైన్ క్రాస్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తూ సదరు వాహన యజమానికి జరిమానా విధిస్తూ నోటీసులు పంపారు. దీంతో ఆ కారు ఓనర్ లబోదిబోమన్నాడు. ఇంతకీ తనకు ఎందుకు జరిమానా విధించారో ఆయనకి మొదట అర్థం కాలేదు. తరువాత విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. కారు నీడ మార్జిన్ దాటితే ఫైన్ ఎందుకు కట్టాలని ప్రశ్నించాడు. సీసీ కెమెరా ఫుటేజ్ వారి ముందే ప్లే చేయించి, తన కారు గీత దాటలేదనీ నీడ మాత్రమే గీత దాటిందని పోలీసులకు చూపించాడట.
ఇలాంటిదే ఇంకో చిత్రమైన కేసు కూడా మాస్కోలోనే చోటు చేసుకుంది. వాహనాల ఫ్లడ్ లైట్ల వెలుగు క్రాసింగ్ లైన్ దాటుకుంటూ ముందుకు ప్రసరించడాన్ని కూడా నేరంగా పరిగణించి జరిమానా విధించారట! ఈ కేసు కూడా మాస్కోలో చర్చనీయాంశంగా మారింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ట్రాఫిక్ నియంత్రణ చేయడం మంచిదే. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడమూ మంచిదే. కానీ, సిల్లీగా కారు నీడ పడిందనీ, లైట్ల వెలుగు లైన్ దాటిందనీ జరిమానాలు విధిస్తే చా..లా..బా..గో..దు కదా!