ఇండియా - మోస్ట్ ఇంపార్టెట్ అప్డేట్ విన్నారా?

Update: 2020-04-16 15:27 GMT
ఇండియాలో గత 24 గంటల్లో 941 కేసులు. 37 మరణాలు నమోదైనట్లు భారత ఆరోగ్య మంత్రి శాఖ తెలిపింది. రోజూ చేసే టెస్టులు పెరుగుతున్నా... కేసులు భారీగా పెరగడం లేదు. అంటే పీక్ స్టేజికి ఇండియా చేరింది. మరో నాలుగు రోజుల్లో ఇది క్రమంగా తగ్గే అవకాశం ఉంది.కరోనాకు సంబంధించి ఇండియాలో పలు ఆసక్తికరమైన అప్ డేట్స్ ని తెలుసుకుందాం.

ప్రపంచంలో 53 వేర్వేరు దేశాల్లో నివసిస్తున్న 3336 మంది భారతీయులకు కరోనా సోకింది. 25 మంది చనిపోయారు. వీరు ఎన్నారైలు మాత్రమే. అక్కడ పౌరసత్వం పొందిన వారు ఈ లెక్కల్లో లేరు.

కరోనా టెస్టింగ్ కిట్స్ ని భారతదేశం కొరియా నుంచి చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది.

కరోనా పోరాటానికి అవసరమైన ఇతర మెడికల్ ఎక్విప్ మెంట్లను ఇండియా జర్మనీ, బ్రిటన్, అమెరికా, మలేషియా, జపాన్, ఫ్రాన్స్ ల నుంచి దిగుమతి చేసుకుంటోంది.

ఇప్పటివరకు ఇండియ 5 లక్షల టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకుంది. ఇంకా కొన్నా రాబోతున్నాయి. ఇవన్నీ చైనా నుంచి వచ్చినవే.

ఇప్పటివరకు ఇండియా 2.9 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఏప్రిల్ 15న ఒక్కరోజే 30 వేల మందికి పరీక్షలు చేసింది.

ప్రపంచంలో కోవిడ్ పై పోరాటానికి ఉపయోగపడుతున్న అతి ముఖ్యమైన మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్. దీనిని మనం 55 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.

ఇంతవరకు దేశంలో 325 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం మన అదృష్టం.


Tags:    

Similar News