బ్యాంకులను ముంచుతున్నది సినీస్టార్లు, ఎంపీలే!

Update: 2015-03-20 04:46 GMT
తమ బ్యాంక్‌ నుంచి రుణాలను తీసుకొని ఎగ్గొడుతున్న వాళ్లలో రాజకీయ ప్రముఖులు, ఎంపీలు, సినిమా వాళ్లే ముఖ్యులు అని అంటున్నారు ఆంధ్రాబ్యాంక్‌ సీఎండీ. వారి వల్లనే బ్యాంక్‌కు నష్టం వస్తోందని..అలాంటి ఆర్థికలావాదేవీలు బ్యాంక్‌కు భారం అవుతున్నాయని ఆయన ప్రకటించారు.

    ఒక బ్యాంక్‌ సీఎండీ ఇలా మాట్లాడటం ఆసక్తికరమైన అంశమే. సినిమా వాళ్లు సమాజం దృష్టిలో సెలబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. స్టార్లుగా చెలామణి అవుతున్నారు. మరి అలాంటి వారు బ్యాంకింగ్‌ వ్యవస్థకు భారం అవుతున్నారంటే వాళ్ల వ్యవహారాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

    అలాగే ఎంపీలు.. ప్రజల చేత ఎన్నికయ్యే వాళ్లు బ్యాంక్‌ రప్ట్‌లు అని అర్థమవుతోందిప్పుడు. అయితే ఎంపీలు తమ వ్యక్తిగత పనుల కోసం లోన్లు తీసుకోవడం లేదు. ఏపీ వరకే తీసుకొంటే చాలా మంది ఎంపీలు వ్యాపారస్తులు..కాంట్రాక్టర్లు.

    గత టర్మ్‌లో ఎంపీలుగా ఉన్న వారైనా.. ఇప్పుడు ఎంపీలుగా ఉన్న వారైనా వ్యాపారస్తులే. వీళ్లు తమ పరపతిని ఉపయోగించుకొని లోన్లను తెచ్చుకొని వాటిని తిరిగి చెల్లించడంలో నిర్లక్ష్యం వహించడం, వాటిని ఎగ్గొట్టడం చేస్తున్నారు.

    ఇప్పటి వరకూ ఇలాంటి వివాదాలు చాలా వరకూ వెలుగులోకి వచ్చాయి. అయితే రాజకీయ నేతలు తమ పరపతిని ఉపయోగించుకొని వీటిపై పూర్తి స్థాయిలో చర్చ జరగకుండా చూసుకొంటున్నారు. వీళ్ల గురించి బ్యాంకులు కూడా తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. మరి వీళ్లనేం చేయాలో!

Tags:    

Similar News