కన్నబిడ్డను చంపేందుకు తల్లి కసాయి ప్లాన్లు.. విచారణలో షాకింగ్ నిజాలు

Update: 2022-08-07 06:09 GMT
కడుపున పుట్టిన బిడ్డను ఏ తల్లి అయినా అపురూపంగా చూసుకుంటుంది. కానీ ఆ కసాయి తల్లి మాత్రం సొంత బిడ్డనే చంపుకుంది. ఏకంగా 4వ అంతస్తు నుంచి కింద పడేసింది. ఆ మానసిక వైకల్యం ఉన్న బిడ్డను వదిలించుకునేందుకు కసాయి ప్లాన్లు అన్ని వేసింది.

బెంగళూరులో ఇటీవల ఓ తల్లి చేసిన పని అందరినీ కంటతడిపెట్టించింది. నగరంలో సంపంగిరామనగర సీకేసీ గార్డెన్ అద్విత్ అపార్ట్ మెంట్ లో నాలుగో అంతస్తు నుంచి ఐదేళ్ల బిడ్డను కిందకు విసరేసి హత్య చేసిన తల్లి, దంత వైద్యురాలు సుష్మాపై విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. బిడ్డను చంపడమే కాదు.. తను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నటించి అందరినీ మోసం చేసింది.

కడుపున పుట్టిన బిడ్డకు మానసిక వైకల్యం అనే కారణంతోనే తల్లి నాలుగో అంతస్తు నుంచి పడేసిందని.. హత్య కేసు నమోదు చేసి తల్లి సుష్మను అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ డీసీపీ శ్రీనివాసగౌడ తెలిపారు.

ఇక భార్య చేసిన హత్యను సీసీ కెమెరాల్లో చూసిన భర్త కిరణ్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆమెకు బిడ్డ భారమనిపించి ఉంటే నేనే పోషించేవాడనని ఆవేదన చెందాడు. కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్య సుష్మాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక విచారణలో సుష్మ ఆగడాలన్నీ వెలుగుచూశాయి. గతంలో బిడ్డను వదిలించుకోవాలని రైల్లో వదిలేసి వెళ్లింది. ఒక ఎన్జీవో సభ్యులు గాలించి కుటుంబానికి అప్పగించారు. ఇక సొంత బిడ్డనే హత్య చేయాలని అనేకసార్లు ప్రయత్నాలు చేసిందని విచారణలో తేలింది.

2017లో బెంగళూరు జేపీ నగరలో సరిగ్గా ఇటువంటి సంఘటనే జరిగింది. స్వాతి సర్కార్ అనే ప్రైవేట్ స్కూల్ టీచర్ తన కూతురు ఇలానే మానసిక వైకల్యంతో బాధపడుతోందని తెలిసి ఆ పాపను బిల్డింగ్ పైనుంచి కిందపడేసి చంపేసింది. తర్వాత స్థానికులు ఆ తల్లిని పట్టుకొని కరెంట్ స్తంభానికి కట్టేసి చావబాదారు.

సొంత బిడ్డలనే పోషించలేక.. వారి మానస్థిక వైకల్యాన్ని భరించలేక ఆ తల్లులు చేస్తున్న ఈ హత్యాకాండ అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. బిడ్డలను చంపుకోవడానికి మనసెల వాస్తుందని అందరూ ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News