సరైన పెళ్లికొడుకు దొరకలేదని సూసైడ్?

Update: 2016-02-16 06:55 GMT
ప్రతి మరణానికి ఏదో ఒక కారణం ఉంటుంది. అందుకే పెద్దోళ్లు.. చావు తన మీద నెపం వేసుకోదని.. ఏదో ఒకదాని మీదకు నెట్టేస్తుందే తప్ప.. మృత్యువు బాధ్యత తీసుకోదని పెద్దోళ్లు చెబుతుంటారు. చావు గురించి పక్కన పెడితే.. బలవన్మరణం విషయంలో చాలా అంశాలు విస్మయకరంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అయితే.. ఈ కారణానికి కూడా ఆత్మహత్య చేసుకోవాలా? అనిపించే పరిస్థితి. తాజాగా తమిళనాడులో వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం అదే తీరులో ఉంది.

తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలోని అన్ననూర్ కు చెందిన తల్లీ కూతుళ్లు.. భాగ్య(52).. కుమార్తె క్రితిక (25)లు ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. అయితే.. వీరి ఆత్మహత్యకు  కారణంగా సరైన పెళ్లికొడుకు దొరకలేదన్న మనస్తాపంతో అని స్థానికులు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. భర్త చనిపోవటంతో కుటుంబాన్ని(కూతురు.. కొడుకు) 52 ఏళ్ల భాగ్య పోషిస్తోంది. ఆమె కుమార్తె క్రితిక ఒక కళాశాలలోపని చేస్తోంది. ఆమె  కుమారుడు దినేశ్ పనిలో భాగంగా చెన్నై వెళ్లారు. అయితే.. ఉదయం నుంచి ఇంటి తలుపు తెరుచుకోకపోవటంతో స్థానికులు అనుమానంతో ఇంట్లోకి వెళితే.. తల్లికూతుళ్లు వేర్వేరు గదుల్లో ఉరి వేసుకొని ఉండటం కనిపించింది. వివాహ విషయంలో చోటు చేసుకున్న ఘర్షణలు.. సరైన పెళ్లికొడుకు దొరకటం లేదన్న బాధతో సూసైడ్ చేసుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.
Tags:    

Similar News