షర్మిలతో మోటివేషనల్ స్పీకర్ షఫీ భేటీ! .. పార్టీలోకి చేరతారంటూ జోరుగా ప్రచారం !
ఏపీ సీఎం వై ఎస్ జగన్ సోదరి షర్మిల తెలంగాణ లో కొత్త పార్టీ ఏర్పాటు చేయడం ఖాయమైన సంగతి తెలిసిందే. పార్టీ ఏర్పాటు క్రమంలో ఆమె పలువురు నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. పార్టీ కోసం కార్యచరణ రూపొందిస్తూ పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ సర్కారు కు సలహాదారుగా వ్యవహరించిన రామచంద్రమూర్తి ఈ మద్యే షర్మిలను కలిశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ సైతం షర్మిలతో సమావేశం కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే, అయన షర్మిల పార్టీలో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. షర్మిల పార్టీకి సలహాదారులుగా మాజీ ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ ఉదయ సింహా ఉంటారని సమాచారం. వైఎస్ హయాంలో సీఎస్ వోగా ఉదయ సింహా పని చేశారు. ప్రభాకర్ రెడ్డి సీఎంవోలో అడిషనల్ సెక్రెటరీగా పని చేశారు. ఇదిలా ఉంటే .. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటున్న షర్మిలను మంత్రులు టార్గెట్ చేస్తూ పదునైన విమర్శలు చేస్తున్నారు. ఇక , వైఎస్ తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మే 14 లేదా ఆయన జయంతి రోజైన జులై 8న షర్మిల కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత వెంటనే ఆమె తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసేఅవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.