ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అండగా నిలిచి...తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు మరోమారు అదే రీతిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ సారి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందే తెలుగుదేశం పార్టీ అని పేర్కొంటూ...2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని వెల్లడించడమే కాకుండా...అవసరమైతే టీఆర్ ఎస్ లేదా బీజేపీకి సపోర్ట్ చేస్తామని ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా మరోమారు టీఆర్ ఎస్ గురించి కీలక కామెంట్లు చేశారు.రాష్ట్రంలో టీఆర్ ఎస్ తో..కేంద్రంలో బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందని మోత్కుపల్లి తెలిపారు.
హైదరాబాద్ లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మోత్కుపల్లి నర్సింహులు...తమ పార్టీకి రేవంత్ రెడ్డి వల్ల నష్టమే తప్ప లాభం లేదని తేల్చేశారు. రేవంత్ నిన్న గాక మొన్న టీడీపీలోకి వచ్చారని పేర్కొంటూ...ఆయన వ్యవహారశైలి సీనియర్లను గౌరవించేలా లేదన్నారు. పార్టీకి విరుద్దంగా ముందుకు సాగుతున్న రేవంత్ పై చర్యలు తీసుకోవాలన్నారు. అయితే అది తమ అధిష్టానం మాత్రమే తీసుకోవాలని తెలిపారు. రేవంత్ ను సస్పెండ్ చేసే అధికారం తనకు లేదని.....అది మా అధిష్టానం తీసుకుంటుందని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆ అధికారం తనకు ఉంటే ఎప్పుడో సస్పెండ్ చేసే వాడినని తెలిపారు. ఇంత జరిగిన తర్వాత రేవంత్ సారథ్యంలో జరిగే టీడీఎల్పీ సమావేశానికి పార్టీ నేతలు వెళ్లరని భావిస్తున్నట్లు తెలిపారు.
రేవంత్ తో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదని..ఆయన వేసే స్టెప్ సరైన దారిలో లేదు కాబట్టే మేము అడ్డుకుంటున్నామని మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. టీఆర్ ఎస్ తో టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని అన్నారు. కేంద్రంలో బీజేపీతో - రాష్ట్రంలో టీఆర్ ఎస్-టీడీపీ పొత్తు ఉంటుందని జోస్యం చెప్పారు. 2009లో కలిసి పని చేశామని పేర్కొంటూ ఇప్పుడు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తాను బెస్ట్ ఫ్రెండ్స్ అని మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. 1986 నుంచి కేసీఆర్ - తనకు పరిచయం ఉందని తెలిపారు. తాను టీడీపీ పార్టీ హీరోనని పేర్కొంటూ చివరి వరకు టీడీపీలోనే ఉంటానని ప్రకటించారు. కేసీఆర్ కు - తనకు వ్యక్తిగత శత్రుత్వం ఏమి లేదని అన్నారు.