పార్లమెంట్ లో పాడుపని.. పోర్న్ చూస్తూ దొరికి పోయిన ఎంపీ

Update: 2020-09-20 02:30 GMT
పార్లమెంట్ అంటే ఎంతో పవిత్రమైనదిగా చెప్పుకుంటాం. అక్కడ ఎన్నో చట్టాలను చేసుకుంటాం. అంత పవిత్రమైన స్థలంలో ఓ ఎంపీ పోర్న్ వీడియోలు చూసుకుంటూ రిపోర్టర్లకు అడ్డంగా దొరికి పోయాడు. ఇది బ్యాంకాక్ పార్లమెంట్ లో జరిగింది. ప్రస్తుతం థాయిలాండ్ లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి.

ఈనెల 16వ తేదీన పార్లమెంట్ లో బడ్జెట్ పై  ప్రసంగం జరుగుతుండగా చోన్ బురి ప్రావిన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ  ఎంపీ రొన్న తెప్ అనువత్ మాత్రం తన స్మార్ట్ ఫోన్ బయటికి తీశాడు. అందులో పోర్న్ వీడియోలు చూడటం మొదలు పెట్టాడు. ఇది ప్రెస్ గ్యాలరీ లో ఉన్న రిపోర్టర్లకు క్లియర్ గా కనిపించింది. వెంటనే వారు ఫోటోలు, వీడియోలు తీశారు. ఇవి బయటకు రావడంతో అనువత్  వ్యవహారం సంచలనంగా మారింది. పార్లమెంట్లో.. అది కూడా ముఖ్యమైన బడ్జెట్ ప్రసంగం జరుగుతుండగా ఈ పాడు పని ఏంటీ అని ప్రజలంతా విమర్శిస్తున్నారు. చట్ట సభలో ఇంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడమా.. అని నిలదీస్తున్నారు.

అనువత్ మాత్రం ఈ వ్యవహారం పై తేలిగ్గా స్పందించారు. తాను అసలు పార్లమెంట్ లో పోర్న్  చూడ లేదని బుకాయించారు. ఓ మహిళ ఆర్థిక సాయం చేయాలంటూ మెసేజ్ పంపిందని.. ఆ మెసేజ్ ని ఓపెన్ చేయగానే ఆ వీడియోలు  కనిపించాయని.. ఆ మహిళ వాటిని సాయం కోసం పంపలేదని గుర్తించి వెంటనే వీడియోలు చూడడం ఆపానని.. జరిగిందిదేనని  చెప్పుకొచ్చాడు. కానీ రిపోర్టర్లు లో తీసిన వీడియోలు,  ఫోటోలు చూస్తే అనువత్ జుగుప్సా అసభ్య  కరమైన వీడియోలను తదేకంగా చూస్తూ గడిపినట్లు తెలుస్తోంది. థాయిలాండ్ పార్లమెంట్లో ఇలాంటి ఘటనలు కొత్తేం కాదు. 2012లో బ్యాంకాక్ కు చెందిన  ఎంపీ బంటద్ తన్ పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా పోర్న్ చూస్తూ అడ్డంగా దొరికిపోయారు.
Tags:    

Similar News