ట్యూబ్ లైట్ టిక్కెట్లు అమ్మిన రాష్ట్రమంత్రి

Update: 2017-06-24 07:56 GMT
ప్ర‌ముఖుల మీద అభిమానం మామూలే. అయితే.. ఒక రాజ‌కీయ ప్ర‌ముఖుడికి.. ఒక సినిమా ప్ర‌ముఖుడంటే పిచ్చ అభిమానం కాస్తంత అరుదైన విష‌యం. అది కూడా ఎంత‌న్న విష‌యం తెలిస్తే షాక్ తినాల్సిందే. ఒక రాష్ట్ర మంత్రి త‌న అభిమాన హీరో సినిమా విడుద‌లైన నేప‌థ్యంలో.. తానే  సొంతంగా థియేట‌ర్లో టిక్కెట్లు అమ్మిన విచిత్ర‌మైన ఉదంత‌మిది. న‌మ్మ‌లేన‌కున్నా ఇది నిజ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి గోపాల్ భార్గ‌వ్ కు బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ అంటే మ‌హా ఇష్టం. ఆయ‌న‌కు గ‌ఢ్ కోట‌లో శ్రీ గ‌ణేశ్ పేరుతో ఒక థియేట‌ర్ ఉంది. తాజాగా విడుద‌లైన ట్యూబ్ లైట్ చిత్ర టిక్కెట్ల‌ను ఆయ‌నే స్వ‌యంగా కౌంట‌ర్లో కూర్చొని అమ్మటం మొద‌లు పెట్టారు.

మంత్రిగారే స్వ‌యంగా థియేట‌ర్లో కూర్చొని టిక్కెట్లు అమ్ముతున్న విష‌యాన్ని తెలుసుకున్న మీడియాకు తెలీటంతో అక్క‌డ‌కు వెళ్లారు. దీంతో.. ఒక్క‌సారిగా ఆయ‌న తడ‌బ‌డిపోయారు. 1978 నుంచి తాను థియేట‌ర్ బిజినెస్ చేస్తున్నాన‌ని.. అందులో భాగంగా టిక్కెట్ల‌ను అమ్ముతున్నాన‌ని.. ఇదేమీ త‌న‌కు కొత్త కాద‌ని క‌వ‌ర్ చేసేందుకు ప్ర‌య‌త్నించినా.. మంత్రిగారే స్వ‌యంగా కూర్చొని సినిమా టిక్కెట్లు అమ్మ‌టం మాత్రం అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News