సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామ

Update: 2021-05-16 03:38 GMT
ఏపీ ప్రభుత్వంపై విద్వేశపూరిత వ్యాఖ్యలు చేసినందుకు ఏపీ సీఐడీ చేతిలో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న ఎంపీ రఘురామకృష్ణం రాజు తాజాగా బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఐడీ తనపై నమోదైన కేసులో బెయిల్ ఇవ్వాలని పిటీషన్ వేశారు.

ఇది రేపు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎంపీ రఘురామరాజుకు గుంటూరులోని సీఐడీ కోర్టు ఈనెల 28వరకు రిమాండ్ విధించింది. ఆయన కాళ్లపై గాయాలు ఉండడంతో జైలుకు తీసుకెళ్లకుండా ఆస్పత్రికి తరలించాలని సూచించింది.

ఎంపీ రఘురావ వేసిన బెయిల్ పిటీషన్ ను తాజాగా విచారించిన హైకోర్టు కొట్టివేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. వాదనలు పూర్తి కావడంతో బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు వెళ్లాలని రఘురామకు సూచించింది. సెషన్స్ కోర్టుసైతం దీనిపై విచారణ జరిపి ఎంపీ రఘురామక 14రోజుల రిమాండ్ విధించింది.

ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ పోలీసులు శుక్రవారం ఎంపీ రఘురామను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకొచ్చి విచారిస్తున్నారు.





Tags:    

Similar News