వైఎస్ షర్మిలపై ప్రేమ.. అమరావతి మహిళా రైతులపై ఎందుకు లేదని వైఎస్ విజయమ్మను ప్రశ్నించారు వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ఈమె నీ ఆడకూతురు కానీ.. ఆమె కాదా? అని నిలదీశారు.
వైఎస్ షర్మిలపై హైదరాబాద్ లో దీక్ష చేస్తుండగా జరిగిన దాడిపై ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. షర్మిలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న వైఎస్ విజయమ్మకు.. అమరావతి రాజధాని కోసం పోరాడుతున్న మహిళా రైతులపై పోలీసుల దాడులు గుర్తుకు లేదా? అని ఎంపీ రఘురామ ప్రశ్నించారు.
ఏపీలో మహిళలపై దాడులు జరిగితే విజయమ్మ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. అమరావతిలో మహిళలను ఇళ్లల్లో నుంచి బయటకు రానివ్వడం లేదన్నారు.
షర్మిలకు ఒక రూల్.. ఏపీ మహిళలకు మరొక రూలా? అని ప్రజలు ప్రవ్నిస్తున్నారా? అని రఘురామ అన్నారు.. అమరావతిలో జరుగుతున్న దౌర్జన్యాలపై పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ మాట్లాడాలని ఎంపీ రఘురామ డిమాండ్ చేశారు. తద్వారా పార్టీ గౌరవం మరింత పెరుగుతుందని రఘురామకృష్ణం రాజు సూచించారు.