జగన్ పై సంచలన కామెంట్స్ చేసిన ఎంపీ రఘురామ

Update: 2020-12-29 15:30 GMT
మూడు రాజధానులపై కోర్టుల్లో.. బయటా ఎంత రచ్చ జరుగుతున్నా సీఎం జగన్ మాత్రం తన పంథాను మార్చుకోవడం లేదని.. కోర్టు తీర్పులు రాకముందే విశాఖపట్నానికి షిఫ్ట్ అయిపోతున్నాడని వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగలోపే సీఎం జగన్ విశాఖకు బిచాణా ఎత్తేయబోతున్నట్లు ఎంపీ సంచలన ప్రకటన చేశాడు.

మంగళవారం మిని రచ్చబండలో మాట్లాడిన రఘురామ ఈ మేరకు పలు అంశాలపై హాట్ కామెంట్స్చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సంబంధించి నాకొక ముఖ్య సమాచారం తెలిసిందన్నారు. ‘‘జనవరి 6 నుంచి 10లోపు ఒకవేళ ఆలస్యం అయితే, సంక్రాంతి పండుగలోగా జగన్ అమరావతిని వదిలేయబోతున్నారు. కొద్ది మంది మందీమార్బలంలో తట్టాబుట్టా దుకాణం సర్దేసుకుని జగన్ విశాఖపట్నానికి వెళ్లిపోడానికి రెడీ అయ్యారని తెలిసింది. కోర్టులో వివాదం  తేలేదాకా విశాఖను రాజధాని అని పిలుచుకోడానికి కూడా వీల్లేని దుస్థితి. జగన్ తనతోపాటు కొద్ది మంది అధికారగణాలను తీసుకెళ్లి మిలీనియం టవర్ లో మకాం పెడతారని విశ్వసనీయంగా తెలిసింది’ అని ఎంపీ రాఘురామ సంచలన విషయాలు చేశాడు.

అమరావతి నుంచి దుకాణం సర్దేసేముందు.. చట్టపరమైన ఇబ్బందులు ఏవైనా వస్తాయేమో జగన్ ఆలోచించుకోవాలని ఎంపీ రఘురామ సూచించారు. మహా అయితే ఇంకో నెల రోజుల్లో తీర్పు రావాల్సి ఉందని తెలిపారు.. కానీ చీఫ్ జస్టిస్ గారు మారాల్సి వస్తోంది. కొత్త సీజేఐ వచ్చిన తర్వాతైనా మూడు నాలుగు నెలల్లో రాజధాని వివాదం ముగుస్తుందని అనుకుంటున్నానని తెలిపారు. అదీ కాకుండా జగన్ ఇక్కడున్నా, ఎక్కడున్నా కలిసేది ఆ ముగ్గురు నలుగురు వ్యక్తులనే కాబట్టి కోర్టు తీర్పు వచ్చేదాకా అమరావతిలో ఉంటేనే మంచిదని సూచించారు.

గతంలో జయలలిత చెన్నైని వదిలేసి ఊటీలోని ఎస్టేట్ నుంచి పరిపాలన చేశారని.. ఇప్పుడు ఆమెను జగన్ ఫాలో అవుతున్నాడని ఎంపీ రఘురామ ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు సైతం దృష్టిసారించిన అమరావతిపై ఇష్టం లేకనే జగన్ మారిపోతున్నారని విమర్శించారు.

ఆవ భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారని.. ఈ భూముల కుంభకోణంపై విచారణ జరిపించాలని కోరారు. ఇంటి దొంగలను కాపాడుకోవాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Tags:    

Similar News