ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ ఆరోగ్యం ఆందోళ‌న‌క‌రం..

Update: 2018-04-08 12:10 GMT
హోదా సాధ‌న కోసం మోడీ స‌ర్కారుపై ఒత్తిడి పెంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేస్తున్న ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష ఎంపీల ఆరోగ్యాన్ని ఆందోళ‌న‌క‌రంగా మారుస్తోంది. ఇప్ప‌టికే దీక్ష చేసిన ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి అనారోగ్యానికి గురి కావ‌టం.. ఆయ‌న ఆరోగ్యం ఏ మాత్రం స‌రిగా లేక‌పోవ‌టంతో బ‌ల‌వంతంగా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. తాజాగా మరో ఎంపీ ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది.

ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ ఆరోగ్యం క్ర‌మంగా క్షీణిస్తోంది. ఆయ‌న శ‌నివారం సాయంత్రం నుంచి జ్వ‌రంతో బాధ ప‌డుతున్నారు. అయిన‌ప్ప‌టికీ త‌న దీక్ష‌ను ఆయ‌న కొనసాగిస్తున్నారు. ఎలాంటి ఆహారం లేకుండా ఉండ‌టంతో ఆయ‌న డీ హైడ్రేష‌న్ కు గుర‌య్యారు. ప‌లు ప‌రీక్ష‌లు జ‌రిపిన రామ్ మ‌నోహ‌ర్ లోహియా వైద్యులు ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

దీక్ష‌ను వెంట‌నే ఆపేయాల‌ని కోరారు. ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ 72కు ప‌డిపోయాన‌ని.. దీక్ష కొన‌సాగించ‌టం స‌రికాద‌ని.. ప్ర‌మాద‌క‌రంగా వైద్యులు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ వ‌ర‌ప్ర‌సాద్ మాత్రం వైద్యుల సూచ‌న‌ను సున్నితంగా తిర‌స్క‌రించారు. దీక్ష సాగించాల‌ని నిర్ణ‌యించారు.

ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ ఆరోగ్య ప‌రిస్థితిపై ఏపీ భ‌వ‌న్ ఆడ్మినిస్ట్రేష‌న్ అధికారి స్పందించారు. ఆయ‌న్ను దీక్ష విర‌మించాల్సిందిగా కోరారు. అయితే.. వారి మాట‌ను ఒప్పుకోని నేప‌థ్యంలో వైద్యులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఏపీ భ‌వ‌న్ కు చేరుకున్న పోలీసులు వ‌ర‌ప్ర‌సాద్ ను బ‌ల‌వంతంగా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మిగిలిన ఎంపీల ఆరోగ్య ప‌రిస్థితి కూడా అంత బాగోలేద‌ని వైద్యులు చెబుతున్నారు.
Tags:    

Similar News