చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు అమరావతిని తెగ ప్రేమించారు. అక్షరమాల నిర్వచనాన్ని మార్చి అ అంటే అమ్మ కాదు అమరావతి అంటూ ప్రచారం చేశారు. చంద్రబాబు అమరావతి మీద అంత ప్రేమ ఒలకబోయడానికి కారణం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు సొంత అభివృద్ధి, సొంత వ్యాపారం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ ఎంపీ, సీనియర్ వైసీపీ నేత విజయసాయిరెడ్డి.
అమరావతిలోని 33 వేల ఎకరాలలో 30 వేల ఎకరాలు చంద్రబాబు బంధువులు, బినామీలకే చెందేలా చంద్రబాబు పక్కా ప్లాన్ రెడీ చేశారని, దీని వెనుక పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని... అందుకే అమరావతి గురించి రాష్ట్రంలో ఎవరికీ లేని ఆందోళన చంద్రబాబుకు ఉందన్నట్లు వ్యాఖ్యానించారు సాయిరెడ్డి. అమరావతికి ఏమైనా జరిగితే తన బంధుమిత్ర గణం రోడ్డున పడుతుందని చంద్రబాబు ఆవేదన అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఆంధ్రాని జపానీకరణ చేస్తున్నట్టు.... ’’ఇక అమరావతి జపాన్ కు రెండో రాజధాని అవుతుందని, 15 ఓడరేవుల అభివృద్ధికి ఆ దేశం సహకారం అందిస్తుందని కోతలు కోసిన చంద్రబాబు అమరావతి-టోక్యోల మధ్య డైరెక్టు ఫ్లైట్లు నడుపుతామని‘‘ చెప్పారు... మరి గత ఐదేళ్లలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పమని సాయిరెడ్డి నిలదీశారు. మొత్తానికి ఎన్నికల ముందు ఊహించని వజ్రాయుధంలో మారి చంద్రబాబును అధికారం నుంచి దింపేసిన సాయిరెడ్డి... ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబుకు నిద్రపట్టనివ్వడం లేదు. మరి దీనికి చంద్రబాబు ఏం సమాధానం ఇస్తారో చూడాలి.