ఏపీలో కాస్ట్లీ.. ఢిల్లీలో బీద అరుపులు!

Update: 2022-04-07 23:30 GMT
ఏపీలో ఉన్న వైసీపీ స‌ర్కారును చూస్తే.. ద్వంద్వ ప్ర‌మాణాలు పాటిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కు లు. ఇక్క‌డ ఉంటే..ఏపీలో వెలిగిపోతోంద‌ని.. చెబుతున్న ప్ర‌బుత్వం, ప్ర‌భుత్వ ముఖ్యులు.. ఇత‌ర కీల‌క నాయ‌కు లు.. ఢిల్లీ స‌రిహ‌ద్దులు చూడ‌గానే.. ముఖ్యంగా ప్ర‌ధాని.. ఆఫీస్ ముందుకువెళ్ల‌గానే అదేంటో బేల‌గా మారిపో తున్నారు. ఏపీలో చూస్తే.. ఇంత చేశాం.. అంత చేశాం.. ఇలా చేశాం.. అలా చేశాం.. అని చెప్పుకొంటున్నారు. అంతేకాదు.. పెట్టుబడుల వ‌ర‌ద కూడా పొంగుతోంద‌ని చెబుతున్నారు. కానీ, ఢిల్లీని చూడ‌గానే.. ``అప్పు ప్లీజ్‌``అంటూ.. శ‌ర‌ణు జొచ్చుతున్నార‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

తాజాగా.. వైసీపీ కీల‌క నాయ‌కుడు.. ఇటీవ‌లే రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం పూర్త‌యిన‌.. విజ‌య‌సాయిరెడ్డి.. ఒక ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ``క‌రోనా సంక్షోభంతో ప్ర‌పంచం మొత్తం కొట్టుమిట్టాడుతున్నా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం విదేశీప్ర‌త్య‌క్ష పెట్టుబడులు పెరిగాయి. `ఇన్వెన్ట్ ఇండియా` వెల్ల‌డించిన తాజా స‌ర్వే ఫ‌లితాల్లో.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఏపీ అగ్ర‌స్థానంలో నిలిచింది. 2019 అక్టోబ‌రు నుంచి 2021 డిసెంబ‌రు వ‌ర‌కు రాష్ట్రంలో 451 మిలియన్  అమెరిక‌న్ డాల‌ర్ల విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని స‌ర్వే పేర్కొంది`` అని సాయిరెడ్డి సంతోషం వ్య‌క్తం చేశారు.

అంతేకాదు..ఒక వైపు త‌ను, మ‌రోవైపు.. సీఎం జ‌గ‌న్ ఫొటోలతో ఉన్న ఒక ఫొటోను కూడా ట్వీట్ చేశారు. అంటే.. త‌మ హ‌యాంలోనే రాష్ట్రానికి 451 మిలియన్ డాల‌ర్ల విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబడులు వ‌చ్చాయ‌ని సాయిరెడ్డి చెప్పారు. మ‌రి ఇది నిజ‌మే అయితే.. ఏపీ ఇంత పురోభివృద్ధిలో ఏకంగా.. ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు ఆర్జించే రేంజ్‌లో ఉంటే.. మ‌రి అప్పులు చేయ‌డం ఎందుకు?  కేంద్రం వ‌ద్ద‌కు వెళ్లి ప్లీజ్‌.. ప్లీజ్‌.. అని అర్ధించ‌డం.. అప్పులు పెంచండి.. అంటూ.. విన‌తి ప‌త్రాలు ఇవ్వ‌డం ఎందుకు? అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌వైపు రాష్ట్రంలో ఏం జ‌రుగుతోందో.. అంద‌రికీ తెలిసిందే.

గ‌త మూడేళ్ల వైసీపీ పాల‌న‌లో ఒక్క పెట్టుబ‌డి కూడా రాక‌పోగా.. వ‌చ్చిన పెట్టుబ‌డులు కూడా వెన‌క్కి పోయాయ‌నేది దాచేస్తే.. దాగే య‌వ్వారం కాదు. ఇక‌, పెట్టుబడులు రావ‌డం లేద‌ని.. క‌రోనాతో ఎఫెక్ట్ అయ్యామ‌ని.. అయినా.. సంక్షేమం ఆప‌కుండా.. అమ‌లు చేస్తున్నామ‌ని.. సాక్ష‌త్తూ.. సీఎం జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. మ‌రి ఆయ‌న మాట‌ను బ‌ట్టి.. పెట్టుబ‌డులు రాలేద‌నేది వాస్త‌వంకాదా? అంటున్నారు ప‌రిశీల‌కులు.  ఉద్యోగులకు జీతాలు ఇచ్చే ప‌రిస్థితి కూడా లేకుండా పోయిన ద‌రిమిలా..వాయిదాల ప‌ద్ధ‌తిలోవారికి వేత‌నాలు ఇచ్చారు.

ఎప్పుడో అప్పుడు ఇచ్చాం.. క‌దా! అని తాజాగా మాజీ అయిన ఆర్థిక మంత్రి బుగ్గ‌న వ్యాఖ్యానించారు. ఇక‌, పీఆర్సీ  విష‌యంలో గ‌తి, గ‌త్యంత‌రం లేక‌నే ఉద్యోగుల‌తో బేరం ఆడాల్సి వ‌చ్చింద‌ని కూడా చెప్పారు. ఇక‌, కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు చెల్లించ‌డం త‌గ్గించేశారు. ఇలా.. అనేక రూపాల్లో ఆర్థిక క‌ష్టాలు ఎదుర‌య్యాయి.

ఒక‌వేళ ఇప్పుడు విజ‌య‌సాయిరెడ్డి చెప్పిందే వాస్త‌వం అయితే.. రాష్ట్రం పురోభివృద్ధిలో ఉంటే.. ఢిల్లీలో అప్పుల కోసం.. వేచి చూడడం.. అక్క‌డే ఆఫీసులు ప‌ట్టుకుని.. కాల‌క్షేపం చేయ‌డం .. సాక్షాత్తూ.. సీఎం జ‌గ‌న్ ఢిల్లీ బాట ప‌ట్టి ప్ర‌ధానిని క‌లిసి.. అప్పుల కోసం.. అర్ధించ‌డం.. ఇవ‌న్నీ ఎందుకు జ‌రుగుతున్నాయ‌ని.. అంటున్నారు ప్ర‌జ‌లు. 
Tags:    

Similar News