`టీడీపీ అంటే తొడలు, దేహం, పార్టీ`... సాయిరెడ్డి పొలిటిక‌ల్‌ పంచాంగం

Update: 2022-05-30 17:03 GMT
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.  విజయసాయిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాట తప్పనిది. 70 శాతం సామాజిక న్యాయం చేశాము. పరిపాలనా సౌలభ్యం కోసం సంస్కరణలు చేసిన ప్రభుత్వం మాది. రూ. 1.42 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించాము`` అని తెలిపారు. ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ సంత‌కం చేసి.. సోమ‌వారంతో మూడేళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో సాయిరెడ్డి మాట్లాడారు.

``రైతుభరోసా వంటి పథకాలతో రైతులకు వైసీపీ ప్రభుత్వం చేరువైంది. మహిళా సాధికారతను ప్రభుత్వం చేసి చూపింది. 50 శాతం పదవులు మహిళలకే ఇచ్చాము.  వైద్య రంగంలో విప్లవాత్మక‌ మార్పులు తీసుకువచ్చాము. విద్యారంగంలో నాడు-నేడు కార్యక్రమంతో స్కూళ్లను అభివృద్ధి చేశాము. చంద్రబాబు తెచ్చిన పథకం చెప్పుకోవటానికి ఒక్కటీ లేదు. మహానాడులో తొడలు కొట్టిస్తున్నాడు. జనంతో బూతులు తిట్టిస్తున్నారు`` అని సాయిరెడ్డి అన్నారు.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుపైనా.. టీడీపీపైనా.. తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు సాయిరెడ్డి. ``టీడీపీ అంటే తొడలు, దేహం, పార్టీ.  తాగుబోతు అయ్యన్నపాత్రుడు నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు.  CBN  అంటే చంద్రబాబు నాయుడు కాదు, చంద్రం బూతుల నాయుడు. ఇలా బూతులు తిట్టడమే చంద్రబాబు నైజమా?. మిగతావారు తిడుతుంటే చంద్రబాబు శునకానందం పొందుతున్నారు. చంద్రబాబు ఏడ్చినా సింపతీ రాదు. చంద్రబాబు తన కొడుకును నమ్మటంలేదు కానీ, దత్తపుత్రుడునే నమ్ముకుంటున్నారు`` అంటూ.. ఎద్దేవా చేశారు.

చంద్రబాబు తనకు తాను అపరచాణక్యుడు అనుకుంటున్నారని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. కానీ, ఆయనను జనం చీదరించుకుంటున్నారని తెలుసుకోవటం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయన మనుషులు తప్ప మరెవరూ బాగుపడర‌ని దుయ్య‌బ‌ట్టారు. కానీ, జగన్ పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుంద‌న్నారు. 2019లో అందరం ఎలా పని చేశామో 2024లో కూడా అంతకుమించి పని చేసి మళ్ళీ సీఎంగా వైఎస్‌ జగన్‌నే గెలిపించుకుంటామ‌ని సాయిరెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. 
Tags:    

Similar News