ఆయన పెద్దన్న గారు. ఈయన ఒద్దికగా ఉండే తమ్ముడు. ఎంత బాగుందో ఈ రాజకీయ అనుబంధం. ఇన్నాళ్ళూ ఎవరికీ తెలియని బంధం ఇది. ఈ మధ్యనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా మీట్లో తనకూ చంద్రబాబుకు మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఎంత క్లోజో చెప్పి టోటల్ ఏపీ రాజకీయానికే షాక్ ఇచ్చేశారు.
తెల్లారిలేస్తే విజయసాయిరెడ్డి ట్విట్టర్ బాబు గురించే గోల గోల చేస్తుంది. చంద్రబాబు టోటల్ పొలిటికల్ లైఫ్ లో ఇంతలా ర్యాగింగ్ చేసిన నాయకుడు మరొకరు కనబడరు. బాబు తుమ్మినా దగ్గినా అందులో కూడా సెటైర్ వెతికి కరెక్ట్ టైమ్ టైమింగ్ తో ట్వీట్ వేసే వారులో విజయసాయిరెడ్డే అగ్రభాగాన ఉంటారు.
అలాంటి విజయసాయిరెడ్డి బాబును అన్నయ్యా అంటూ పిలిస్తే ఆ అభిమానానికి చంద్రబాబే ఆశ్చర్యపోతారు కదా. తనకు బాబు అన్నయ్య వరస అవుతారు అని ఈ మధ్య చెప్పిన విజయసాయిరెడ్డి లేటెస్ట్ బాబనయ్యా పెద్దన్నయ్యా అంటూ మళ్ళీ ట్విట్టర్ లో చెడుగుడు ఆడేశారు.
అల్జీమర్స్ తో బాధపడుతున్న మా అన్నయ్యకు ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు రాదు లెండి అంటూ వెటకారమాడుతూనే గోదావరి పుష్కరాల వైనాలను, 30 మంది దాకా జనాలు మరణించిన విషయాన్ని విజయసాయిరెడ్డి బయటపెట్టారు. ఏపీకి 2016 నుంచి 18 దాకా. 2018 నుంచి 2019 దాకా సగటున 7.6 నుంచి 8.3 శాతం దాకా అధిక వడ్డీలకు రుణాలు తెచ్చింది నీవు కదా అన్నయ్యా అంటూ తమ్ముడు విజయసాయిరెడ్డి బాగానే వేసుకున్నారు.
వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక 6.5 శాతం వడ్డీకి మాత్రమే రుణాలు తెచ్చామని గుర్తు చేశారు. ఇక అన్నయ్యా ఇంత సంపాదించిన దాంట్లో కుటుంబ సభ్యులకు ఎలాంటి వాటా ఇవ్వలేకపోయావుగా అని కూడా ఎకసెక్కమాడారు. అన్నయ్య మరచిన విషయాలను తమ్ముడుగా నేను చెబుతున్నా అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్స్ చేస్తూ ఏపీలో మరో కలకలం రేపారు.
నిజానికి విజయసాయిరెడ్డి బాబు మీద విమర్శలు చేయడం సహజాతిసహజం. కానీ అన్నయ్యా అంటూ ఒకవైపు విపరీతమైన అభిమానం ఒలకబోస్తూనే ఇలా తమ్ముడుగా చెడుగుడు ఆడడమే ఇప్పుడు విశేషంగా చూస్తున్నారు. మొత్తానికి ఈ అభినవ అన్నదమ్ముల రాజకీయం ఆంధ్ర జనావళిని ఆకట్టుకునేలాగే ఉంది మరి.