ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిమ్మగడ్డ హయాంలో లేనట్టే..!

Update: 2021-03-12 07:36 GMT
ఏపీ ప్రభుత్వానికి .. ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కు చాలా కాలంగా కోల్డ్​వార్​ సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలు పెట్టొద్దని ప్రభుత్వం.. పెట్టి తీరాల్సిందేనని నిమ్మగడ్డ ఇలా కొంతకాలంగా సందిగ్ధత నెలకొన్నది. ఎట్టకేలకు కోర్టు తీర్పుతో ఎన్నికలు జరిగాయి. అయితే ఎలక్షన్​ కోడ్​ అమల్లోకి వచ్చాక నిమ్మగడ్డ తన అధికారం ఏమిటో చూపించారు. వరసగా కీలక అధికారుల బదిలీలు.. మంత్రులకు వార్నింగ్​తో ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. అయితే నిమ్మగడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని అధికార పక్షం ఆరోపణలు చేసింది.

పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ నిమ్మగడ్డ రమేశ్​ సడెన్​గా ఓ ట్విస్ట్​ ఇచ్చారు. ఆయన ఆకస్మికంగా సెలవు పెట్టారు. ఈ నెల 17 నుంచి 24 వరకు సెలవులో ఉండనున్నారు.

అయితే ఇప్పటివరకు నిమ్మగడ్డను ఆకాశానికి ఎత్తేసిన ఓ వర్గం మీడియా, టీడీపీ నేతలు పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే స్వరం మార్చాయి. నిమ్మగడ్డ మారిపోయారంటూ విమర్శలు చేయడం మొదలు పెట్టాయి. ఏకంగా చంద్రబాబే ఎన్నికల సంఘం పనితీరుపై విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితుల్లో నిమ్మగడ్డ సెలవులో వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ నెల 31 తో ఆయన పదవీకాలం ముగియినున్నది.

ఇదిలా ఉంటే ఆయన 24 వరకు సెలవులో ఉండబోతున్నారు. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆయన హయాంలో జరిగే అవకాశం లేదు. అయితే ఆయన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదల చేసి పోతారా? లేక కొత్త కమిషనరే ఆ బాధ్యతలు నిర్వహిస్తారా? అన్న అంశంపై ఇంకా క్లారిటీ లేదు. కీలక టైంలో నిమ్మగడ్డ టూర్​ కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News