సీఆర్‌ పీఎఫ్‌ జవాన్లకు అండగా ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌

Update: 2019-03-08 11:51 GMT
జమ్మూ కాశ్మీర్‌ లో జరిగిన పుల్వమా దాడిని ప్రతీ భారతీయుడు మర్చిపోలేకపోతున్నాడు. ఈ దాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చనిపోయారు. మన దేశం మొత్తం వీర జవాన్లకు అండగా నిలిచింది. వారి ఆత్మ శాంతికి ప్రార్థనలు చేసింది. ఇప్పుడు టీమ్ ఇండియా కూడా వారి కోసం తమ వంతు సాయం అందించింది. రాంచీలో ఆస్ట్రేలియాలో జరుగుతున్న మూడో వన్డేలో మన క్రికెటర్స్‌ మొత్తం ఆర్మీ క్యాప్‌ ధరించి బరిలోకి దిగారు. మ్యాచ్‌ మొత్తం అదే క్యాప్‌ తో కన్పించారు.

జవాన్ల వెనుక మేమంతా ఉన్నామని తెలియచేసేందుకే ఈ విధంగా చేసినట్లు ప్రకటించాడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. అంతేకాదు.. తనకు ఈ ఐడియా ఇచ్చింది ధోనీయేనని ప్రకటించాడు. అంతేకాదు.. మైదానంలో అడుగుపెట్టేటప్పుడు ప్రతీ క్రికెటర్‌ కు ధోనీయే స్వయంగా ఆర్మీ క్యాప్‌ లు అందించాడు. కేవలం క్రికెటెర్స్‌ మాత్రమే కాదు.. కామెంటరీ బ్యాకులో కూర్చున్న  కామెంటేటర్స్‌ కూడా ఆర్మీ క్యాప్‌ లు ధరించి కామెంటరీ చెప్పడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌ ద్వారా తమకు వచ్చే మొత్తాన్ని.. పుల్వామా దాడిలో చనిపోయిన అమరుల కుటుంబాలకు అందించనున్నట్లు విరాట్‌ కోహ్లి ప్రకటించాడు.

మరోవైపు ఇలాంటి ఇన్సియేటివ్‌ తీసుకున్న మహేంద్ర సింగ్‌ ధోనీని ప్రతీ ఒక్కరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తన సొంత గడ్డపై ఇలాంటి గొప్ప ఆలోచనని వచ్చినందుకు గర్వపడుతున్నట్లు అందరూ చెప్పారు. ధోనీ కూడా ఆర్మీ మేజర్‌. ధోనీకి క్రికెట్‌ లేనప్పుడు ఆర్మీ క్యాంపులకు వెళ్తుంటాడు. మరోవైపు.. ఒక ఇంగ్లాండ్ క్రికెటర్‌ ఇచ్చిన సలహా సూచనలతో తాను ఈ విధంగా చేసినట్లు చెప్పాడు ధోనీ.
Tags:    

Similar News