కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర అంశం మరోమారు రసకందాయంలో పడింది. యాత్ర ఆపేది లేదని ముద్రగడ భీష్మించుకుంటే అనుమతి పేరుతో అడ్డుపుల్ల వేసేందుకు రాష్ట్రప్రభుత్వం ముందుకు సాగుతోంది. తాజాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి - హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇదే విషయం కరాఖండీగా చెప్పారు. ముద్రగడ అయినా - ఎవరైనా సరే ఏదైనా ఆందోళన కార్యక్రమానికి చట్ట ప్రకారం అనుమతి తీసుకోవాల్సిందేనని, ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే పాదయాత్రలంటూ ఆందోళన చేపట్టడం తగదని చినరాజప్ప అన్నారు.
చట్ట ప్రకారం అనుమతి తీసుకోకుండా బేడీలు వేసి తీసుకెళ్ళండి అంటూ రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించడం ముద్రగడకు తగదని చినరాజప్ప అన్నారు. తునిలో ఇటువంటి ఆందోళనకు దిగడంతోనే కేసులు నడుస్తున్నాయన్నారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. దశాబ్దాలుగా కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నవారిలో ముద్రగడ ఒకరని, అంతమాత్రం చేత కాపులను ఏదో ఉద్దరిస్తున్నట్టుగా వ్యహరించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి స్వచ్ఛందంగానే రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు.
కాపులకు రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా తాను నిర్వహించనున్న పాదయాత్రను ఎట్టి పరిస్థితిలోనూ ఆపేది లేదని ముద్రగడ పద్మనాభం పునరుద్ఘాటించారు. ప్రభుత్వానికి అనుమానం ఉంటే అనుమానం ఉంటే తనకు యాత్రలో పాల్గొనే సహచరులకు పోలీసుల చేత బేడీలు వేయించైనా, యాత్రకు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. విపక్ష నేతలుగా రాజశేఖరరెడ్డి - చంద్రబాబు - జగన్మోహన్ రెడ్డి తదితరులంతా పాదయాత్రలు నిర్వహించినపుడు లేని అభ్యంతరం తమ జాతి కోసం తాను జరుపుతుంటే ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు. తామేమైనా తీవ్ర వాదులమా?.., దొంగలమా?..పాదయాత్ర చేసుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. కిర్లంపూడితో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోను పోలీసు పటాలాన్ని దింపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి గారూ..ఎన్నికలకు ముందు మీరు చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీలే ప్రస్తుతం తాను చేస్తున్న పాదయాత్రకు కారణమని’ ముద్రగడ పేర్కొన్నారు. ఇచ్చిన హామీ అమలు కోరితే మీ సంగతి చూస్తాననడం, ఆందోళనకు దిగితే పోలీసులతో కొట్టించడం - తిట్టించడం..ఇదేనా మీ పాలనాతీరు’ అని ప్రశ్నించారు.
గతంలో ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ పాదయాత్ర చేశారని, ఓదార్పు పేరిట వైఎస్ జగన్ - ఆయన సోదరి షర్మిలమ్మ పాదయాత్ర చేశారని, హక్కుల కోసం వామపక్షాలు పలుమార్లు పాదయాత్రలు నిర్వహించాయని ముద్రగడ గుర్తుచేశారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సైతం పాదయాత్ర చేయలేదా అని ప్రశ్నించారు. ఇటీవల విజయవాడలో కాపు యువత జాబ్ మేళాలో డిగ్రీలు - పిజీలు చేసిన వారిని మూడు నాలుగువేల జీతాలకు వెళ్లమని సూచించి, ఇంత తక్కువ జీతమా అని ప్రశ్నించిన కాపు యువతను పోలీసులచేత లాఠీలతో కొట్టించడం ఎంత వరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. కాపు పాదయాత్ర శాంతి భద్రతలకు విఘాతమని డిజిపి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమహేంద్రవరం గోదావరి పుష్కరాల్లో 30మంది భక్తులు బలికావడానికి కారకులయ్యారని, అప్పుడు గుర్తురాని శాంతిభద్రతలు కాపు సత్యాగ్రహ యాత్ర సమయంలోనే గుర్తుకు రావటం విడ్డూరమన్నారు. తునిలో రైలు దగ్ధం - పోలీసు స్టేషన్ దగ్ధం తదితర ఘటనల్లో కాపులకు సంబంధం లేదని ముద్రగడ స్పష్టంచేశారు. సిఎం చంద్రబాబు ఈ దుర్ఘటనలకు బాధ్యులని, అవకాశమిస్తే తాను విచారణలో వివరిస్తానన్నారు. చంద్రబాబు పదవీ కాలం ముగిసేంత వరకు రాష్ట్రంలో సెక్షన్ 30 అమల్లో ఉంచుతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా లేదా అని ముద్రగడ ప్రశ్నించారు. పాదయాత్రలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులూ రావని రాసివ్వమని కోరుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ యాత్రలో వివిధ దుర్ఘటనలు జరిపిస్తే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఏది జరిగినా కాపు జాతికి అంటగడుతున్నారని, అందుకే మా చేతులకు బేడీలు వేస్తే మా తరపునుండి చిన్న తప్పు కూడా జరగదనే భరోసా ఉంటుందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/