నాడు ఎన్టీఆర్ పై చెప్పులు..ఇప్పుడు దండాలా.?

Update: 2018-05-28 08:13 GMT
ఈరోజు మహానటుడు - దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా తెలుగునాట నాయకులు, ఆయన కుటుంబసభ్యులు   ఘననివాళులర్పిస్తున్నారు. ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ సానుభూతిపరులు కూడా ఎన్టీఆర్ కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఒకప్పుడు టీడీపీలో వెలుగు వెలిగి ఇప్పుడు స్వతంత్రంగా ఉంటున్న కాపు ఉద్యమ కారుడు - మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు..

ముద్రగడ మాట్లాడుతూ.. ‘దివంగత ఎన్టీఆర్ గనుక చంద్రబాబుకు తన కూతురును ఇచ్చి పెళ్లి చేసి ఉండకపోతే ఈ పాటికి ఆయన ఎక్కడ ఉండేవాడో’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది అని మండిపడ్డారు. అప్పట్లో సీఎం సీటుకోసం చంద్రబాబు ఎన్టీఆర్ మీద చెప్పుల దండలు వేయించాడని.. ఈ రోజేమో ఆయన విగ్రహానాకి చెప్పులు విడిచి వంగి వంగి దండాలు పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. బాబు నటన ముందు రాజ్ కపూర్ లాంటి స్టార్లు కూడా పనికిరారని.. వాల్లు నటిస్తే .. బాబు జీవిస్తేడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నిర్వాకానికి అవమానభారంతో క్షోభ అనుభవించి ఎన్టీఆర్ మరణించారని పేర్కొన్నారు.

బీజేపీ పొత్తు తప్పిదమని చెబుతున్న చంద్రబాబు.. ఏ ముఖం పెట్టుకొని 2014లో కలిసి పోటీ చేశారని ముద్రగడ ప్రశ్నించారు. అందిన కాడికి దోచుకుతిని వృద్ధ నారీ పతివ్రతలాగా కబుర్లు చెప్పడంలో బాబుకు ఎవరూ పోటీ లేరని  విమర్శించారు. హామీల గురించి అడిగితే కులాల మద్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో నాలుగేళ్లు అంటకాగి ఇప్పుడు కేవలం కేసుల భయంతోనే తనను కాపాడాలంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే నిన్నా మొన్నటిదాకా ఒంటి కాలుపై లేచిన చంద్రబాబు.. ఇప్పుడు అదే పార్టీకి ఓటేయమని అడగడం హైటెక్ వ్యభిచారం కిందకు రాదా అని ముద్రగడ నిలదీశారు.. చంద్రబాబు ఊకదంపుడు ప్రసంగాలు - సొల్లు - సోది వినలేక ప్రజలు ఆయన సభకు రావడం లేదని.. ఉపాధి హామీ కూలీలకు డబ్బులిచ్చి తీసుకొస్తున్నారని ముద్రగడ మండిపడ్డారు. తనకు నచ్చనివారిపై చెప్పులు.. రాళ్లదాడి చేయించడం చంద్రబాబు మానుకోవాలన్నారు.
Tags:    

Similar News