మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాపులకు న్యాయం చేసేవారని ఆయన అన్నారు. తాను చేపట్టిన కాపు ఉద్యమం వెనుక జగన్ హస్తం ఉందన్న టీడీపీ నేతల ఆరోపణలనూ ఆయన తిప్పి కొట్టారు. జగన్ హస్తం ఉందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. తనకు సలహాలిచ్చేటంతటి స్థాయి జగన్ కు లేదంటూ ఆయన గాలి తీసేశారు.
అనంతపురం పర్యటనలో భాగంగా, ఆదివారం కాపు సంఘాల నేతలతో సమావేశమైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమానికి మద్దతివ్వాలని తాము పవన్ కల్యాణ్ ను కోరనేలేదని స్పష్టం చేశారు. అలాగే తనకు సలహాలు ఇచ్చేటంతటి స్థాయి జగన్ కు లేదని ముద్రగడ అన్నారు. జూన్ తరువాత ఉద్యమంలో మలిదశ ప్రారంభమవుతుందని ప్రకటించారు. తుని ఘటనలో కాపులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. కొద్దికాలం కిందట ఉద్యమాన్ని ఆపేసి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన ముద్రగడ మళ్లీ ఇప్పుడు రూటు మార్చడం ఆసక్తి కలిగిస్తోంది. అయితే... స్థిరత్వం లేకుండా ఆయన పట్టుపట్టడం... మధ్యలో వదిలేయడం.. మళ్లీ మొండికేస్తుండడం చూస్తున్నవారు.. ఇలాంటి దారీతెన్నూ లేని ఉద్యమాల వల్ల కాపులకు ప్రయోజనం లేదని అంటున్నారు. ముద్రగడ వెంట వెళ్తే తమనూ అలాగే లెక్కేస్తారని... ఆయన వెంట వెళ్లాల్సిన అవసరం లేదని పలువురు కాపు నేతలు పునరాలోచనలో పడుతున్నట్లు తెలుస్తోంది.