కాపులను బీసీలుగా గుర్తించాలన్న డిమాండ్ తో ఉద్యమిస్తున్న మాజీ మంత్రి - కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన రెండో విడత ఆందోళనను ఉధృతం చేశారు. ఇటీవల ఆయన ప్రకటించిన కార్యాచరణ మేరకు రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. 13 జిల్లాల్లో మంత్రులు - ఎంపీలు - ఎమ్మెల్సీలు - ఎమ్మెల్యేల ఇళ్ళకు కాపు జేఏసీ నేతలు వెళ్ళి వినతిపత్రాలు అందజేస్తారని జేఏసీ రాష్ట్ర నేతలు తెలిపారు.
కాపులకు బీసీ కోటా కోసం పోరాడుతున్న ముద్రగడ పిలుపు మేరకు ఈ దశల వారీ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు జేఏసీ నేతలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లా కేంద్రాల్లో ఆయా ప్రాంతాల జేఏసీ నేతలు తమ ఆకలి కేకలను ప్రజాప్రతినిధులకు వినిపిస్తారన్నారు. జనవరి 9వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల మధ్య జిల్లాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. జనవరి 25వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుండి ముద్రగడ సత్యాగ్రహ పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలియజేశారు. అమలాపురం మీదుగా అంతర్వేది వరకు సాగే ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున కాపు సామాజికవర్గం హాజరుకానున్నట్టు చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాపులను బీసీలుగా గుర్తిస్తామని హామీనిచ్చి చంద్రబాబు నేడు మోసం చేశారని ఆరోపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/