ఉద్యమ బాంబ్ పాదయాత్ర పోస్ట్ పోన్

Update: 2016-11-16 03:44 GMT
సాదాసీదాగా కనిపించే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. కొన్న విషయాల్లో ఎంత సీరియస్ గా ఉంటారో ఆయన చేసే ప్రకటనల్ని చూస్తేనే అర్థమవుతుంది. ఆయన గురించి పెద్దగా తెలీని వారికి ఆయనకున్న జనాదరణ గురించి పెద్దగా అంచనాలు పెట్టుకోరు. కానీ.. ఆయన నోటి నుంచి కానీ ఒక పిలుపు వచ్చిందంటే దానికి స్పందన అనూహ్యంగా ఉండటమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ఉంటుంది.

కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ తో గడిచిన కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న ఆయన.. బుధవారం నుంచి వారం రోజుల పాటు పాదయాత్రను చేపట్టాలని భావించారు. అయితే.. ముద్రగడ చేసే పాదయాత్రకు అనుమతి కావాలంటూ ఏపీ హోం మంత్రి చినరాజప్ప.. డీజీపీలు అభ్యంతరం వ్యక్తం చేయటం.. పాదయాత్రకు ఒక రోజు ముందే ఆయన కదలికలపై పరిమితులు విధించటం.. బయటకు వెళ్లకూడదంటూ అభ్యంతరం వ్యక్తం చేయటం.. రానున్న 48 గంటల్లో (నిన్న సాయంత్రం నుంచి) ఎలాంటి సభలు.. పాదయాత్రలు.. ఇంటి నుంచి బయటకు వెళ్లటం లాంటివి చేయకూడదన్న ఆంక్షల్ని విధించారు.

దీనిపై తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ముద్రగడ.. తనను ఎన్ని రోజులు హౌస్ అరెస్ట్ చేస్తారో చెప్పాలని మండిపడుతూ.. ‘‘ఏన్నేళ్లు చేస్తారు ఒక సంవత్సరమా? రెండేళ్లా? ఎంతో చెప్పండి?’’ అంటూ పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు.  సభలు.. ఇతర కార్యక్రమాలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని.. పాదయాత్రలకు ఎలాంటి  అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయగా.. ‘‘పాదయాత్ర చేయటానికి అనుమతులు లేవని పోలీసు అధికారులు చెబుతున్నారు. వాళ్లు అనుమతి ఇచ్చినప్పుడే పాదయాత్ర కొనసాగిస్తా. 51 శాతం రిజర్వేషన్ ఖాళీగా ఉంది. అందులో కొంతశాతం కాపు జాతికి రిజర్వేషన్ కల్పించాలి. మా జాతి ఆకలి మీద ఉద్యమం చేస్తున్నా. ఎన్నికల సమయంలో కనిపించిన చంద్రబాబుకు.. ఇప్పటి చంద్రబాబుకుచాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పాదయాత్ర చేసుకోవచ్చని హైకోర్టు చెప్పినా.. ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించటం దురదృష్టకరం’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యమ బాంబుగా అభివర్ణించే ముద్రగడ విషయంలోఏపీ సర్కారు సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాదయాత్రను అడ్డుకోవటం ద్వారా కాపుల్లో బాబు సర్కారు మరింత డ్యామేజ్ అయ్యిందనటంలోసందేహం లేదని.. కాపుల రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న బావనకలిగేలా వ్యవహరిస్తే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది. కానీ.. అలాంటి చర్యలేమీ చంద్రబాబు సర్కారులో కనిపించకపోవటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News