కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన ఉద్యమ పంథాలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. బీసీలకు ఇబ్బందుల్లేకుండా కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు కోరుతున్నామని, దానికి బీసీ నాయకులు సహకరించాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బీసీ నాయకులతో ముద్రగడ పద్మనాభం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా బీసీలు - దళితుల సహకారంతోనే గెలిచానని తెలిపారు. బీసీలకు అన్యాయం జరగకుండా ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని ఉద్యమం చేస్తున్నామని, బీసీలకు అన్యాయం చేసే రిజర్వేషన్లను తాము ఆమోదించేది లేదని తేల్చిచెప్పారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలనే తాము అడుగుతున్నామన్నారు.
కాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముద్రగడ లేఖ రాశారు. చావోరేవో తప్ప తమ పోరాటానికి విరామంలేదని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తమను ఓడించాలని ప్రయత్నిసే మీరు ఓడిపోవడం ఖాయమని చంద్రబాబును ముద్రగడ హెచ్చరించారు. ‘మాకు మీరు రిజర్వేషన్లు కల్పించాలంటే మీకు మేం ఏమిచ్చుకోవాలో చెప్పాండి’ అని ముద్రగడ ప్రశ్నించారు. బీసీలను రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని హితవు పలికారు. తమ ఉద్యమానికి బీసీలతోపాటు గిరిజనులు - హరిజనులు అన్ని కులాల మద్దతు ఉన్న విషయాన్ని మరువరాదన్నారు. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్టు ముద్రగడ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/