కాపు ఉద్యమంలో ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదంటూ ముద్రగడ పద్మనాభం మరోసారి దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల తాను దీక్ష చేసిన సమయంలో ప్రభుత్వం పలు హామీలిచ్చి మాట తప్పిందని... కేసులను ఎత్తివేస్తామని చెబుతూనే వరుసగా అరెస్టులకు పాల్పడుతున్నారని ముద్రగడ ఆరోపిస్తున్నారు. అంతేకాదు.... ఇప్పుడు తాను చేపట్టబోయే దీక్షే చివరి దీక్ష అవుతుందని తెలిపారు. మళ్లీ మళ్లీ దీక్షలు చేయబోనని... కాపులకు న్యాయం జరిగేవరకు ఈసారి దీక్ష నుంచి తప్పుకునేది లేదని సంకేతమిచ్చారు.
ఇచ్చిన హామీ నీరుగార్చడమే కాకుండా ప్రభుత్వం మాట తప్పిందని... మళ్లీ రోడ్డెక్కడానికి కారణం వారేనని అన్నారు. రూ. 500 కోట్లు పక్కకు పెట్టేసి రూ. 1000 కోట్లు బడ్జెట్ లో ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. వేలాది అప్లికేషన్ లు వచ్చినా కూడా దీనిని మరిచిపోయారని విమర్శించారు. వైజాగ్ నుండి కొంతమందితో సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేయించారని, రెండు లక్షల కోట్ల రూపాయల మాట లేవనెత్తవద్దని సూచించారని.. తాను మోసపోయానని, చచ్చే వరకు తనకు ఎలాంటి ఇబ్బంది పెట్టవద్దని ముద్రగడ కాస్త ఉద్వేగభరితంగా మాట్లాడారు.
కాగా ముద్రగడ ఈసారి దీక్షపై పట్టుదలగా ఉండడంతో ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో అయని ప్రభుత్వం కొంద ఆందోళన చెందుతోంది. గతంలో మాదిరిగా చర్చలు వంటివేమీ లేకుండా దీక్ష భగ్నం చేయడమే బెటరన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముద్రగడ కూడా తన దీక్షకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.