రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10లో నిలిచారు. ఫోర్బ్స్ విడుదల చేసిన 'ద రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా'లో ముఖేష్ 60 బిలియన్ డాలర్ల సంపదతో 9వ స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో అమెజాన్ అధినేత బెజోస్ 113 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా - మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ 107.4 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో నిలిచారు.
ఆ తరువాత 107.2 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ మూడో స్థానంలో నిలిచారు. 86.9 బిలియన్ డాలర్ల సంపదతో వారెన్ బఫెట్ నాలుగో స్థానంలో - ఫేస్ బుక్ సిఇఒ జూకర్ బర్క్ 74.9 డాలర్లతో ఐదో స్థానంలో ఉన్నారు. తర్వాత వరుసలో ఇండిటెక్స్ ఫ్యాషన్ ఫౌండర్ అమన్సియో - ఓరాకిల్ ఫౌండర్ - కార్లోస్ స్లిమ్ హెలు - అల్పాబెట్ లార్రీ సిఇఒ ఉన్నారు.
2019 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ 13వ స్థానంలో నిలిచారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసిన ట్రేడింగ్ అనంతరం తీసిన లెక్కల ప్రకారం.. ఈ జాబితాలో 60 బిలియన్ డాలర్ల సంపదతో ముకేశ్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. గురువారం నాటి ట్రేడింగ్ లో రిలయన్స్ ఇండిస్టీస్ కంపెనీ మార్కెట్ విలువ మొత్తం రూ.10లక్షల కోట్లు దాటిన నేపథ్యంలో ముకేష్ టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీంతో గతేడాది 13వ స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ.. ఈసారి ఏకంగా టాప్–10లోకి చేరి... ఈ స్థాయి సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.