ప్రపంచంలోనే సంపన్నులకు సంబంధించిన తాజాగా జాబితా ఒకటి రిలీజ్ అయ్యింది. వెల్త్ ఎక్స్.. బిజినెస్ ఇన్ సైడర్ సంయుక్తంగా రూపొందించిన ప్రపంచంలో50 మంది దిగ్గజ కుబేరుల జాబితాలో ‘మనోళ్లు’ ముగ్గురు స్థానం సంపాదించటం గమనార్హం. తాజా జాబితా ప్రకారం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రధమ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక రెండో స్థానంలో అమనికో అర్టేగా గౌనా రెండో స్థానంలో.. మూడో స్థానంలో వారెన్ బఫెట్ నిలిచారు.
ఇక.. మనోళ్ల విషయానికి వస్తే.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 27 స్థానంలో నిలిస్తే.. విప్రో సంస్థల అధినేత అజీమ్ ప్రేమ్ జీ 43 స్థానంలో నిలవగా.. ఔషధ కంపెనీ మొనగాడు దిలీప్ సంఘ్వీ 44వ స్థానంలో నిలిచారు.
ఇక వీరి ఆస్తుల లెక్కల్లోకి వెళితే.. సదరు జాబితా వేసిన లెక్క ప్రకారం తొలి ఐదు స్థానాలు చూస్తే..
1. బిల్ గేట్స్ 8740 కోట్ల డాలర్లు
2. అమనికో అర్టేగా గౌనా 6680 కోట్ల డాలర్లు
3. వారెన్ బఫెట్ 6070 కోట్ల డాలర్లు
4. జెఫ్రీ బెజోస్ 5660 కోట్ల డాలర్లు
5. డేవిడ్ కోచ్ 4740 కోట్ల డాలర్లు
ఇక..
ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ 8వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద 4280 కోట్ల డాలర్లు కాగా.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 27వ స్థానంలోనిలిచారు. ఆయన సంపద 2480 కోట్ల డాలర్లు. విప్రో అదినేత అజీమ్ ప్రేమ్ జీ 43వ స్థానంలో నిలవగా ఆయన సంపద 1650 కోట్ల డాలర్లు. ఇక.. దిలీప్ సంఘ్వీ జాబితాలో 44వ స్థానంలోనిలవగా.. ఆయన సంపద 1640 కోట్ల డాలర్లుగా లెక్క కట్టారు.