ఆ ఆలయం దశ తిరగనుంది..20 కిలోల బంగారం విరాళమిచ్చిన అంబానీ

Update: 2020-11-07 07:50 GMT
దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ జనాలకు  ఉపయోగ పడే కార్యక్రమాల కోసం కూడా అంతే రేంజ్ లో  ఆర్థిక సహాయాలు చేస్తుంటారు. రిలయన్సు ట్రస్ట్ తరఫున నిత్యం అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ముఖేష్ అంబానీకి దైవభక్తి ఎక్కువ. ఎక్కువగా ఆలయాలను సందర్శిస్తుంటారు. ఆయన దర్శనానికి ఏ ఆలయానికి వెళ్లినా ఆ ఆలయ అభివృద్ధికి సాయం చేసి వస్తుంటారు. అలా దేశంలోని పలు  ఆలయాల అభివృద్ధికి ఆయన భారీగానే నిధులు వెచ్చించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే అంబానీకి ఎంతో విశ్వాసం. ఆయన   సమయం చిక్కినప్పుడల్లా శ్రీవారి దర్శనానికి కుటుంబంతో సహా వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం తో పాటు ఇక్కడి సేవా కార్యక్రమాల కోసం భారీ మొత్తంలోనే వితరణ  చేసి వెళ్తుంటారు.   

 తాజాగా ఆయన ఓ ప్రముఖ దేవాలయానికి 20 కేజీల బంగారం విరాళంగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఆలయ గోపురంపై ఉండే కలశాలను తయారు బంగారంతో చేయిస్తున్నారు.  రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చెందిన ప్రత్యేక గోల్డ్ నిపుణులు వీటిని తయారు చేస్తున్నారు.  ఇలా తయారు చేయించిన 20 కేజీల బంగారం కలశాలను దీపావళి రోజున అస్సాంలోని కామాఖ్యా అమ్మవారి ఆలయ అధికారులకు అందజేయబోతున్నారు.  ముకేశ్ అంబానీ దగ్గరుండి బంగారు ఈ తాపడం పనులను చేయిస్తున్నారు.  దేశంలో ఆలయ గోపురాలకు బంగారు తాపడం ఉన్నది చాలా తక్కువే. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు కొన్ని ఆలయ గోపురాలకు మాత్రమే బంగారు తాపడాలు  ఉన్నాయి. ఇప్పుడు కామాఖ్యా అమ్మవారి ఆలయ గోపురాలకు బంగారు తాపడాలు వేస్తే ఆ ఆలయానికి మరింత గుర్తింపు రానుంది.
Tags:    

Similar News