ఇంత తర్వాత స్పందించటమా? ముకేశ్ ప్రకటించిన భారీ సాయం ఇదే!

Update: 2021-04-16 06:30 GMT
భారత కుబేరుడు.. ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరుగా నిలిచిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఎట్టకేలకు కరోనా నేపథ్యంలో భారీ సాయాన్ని ప్రకటించారు. మహారాష్ట్రలో కరోనా కేసులు కుప్పలు.. కుప్పలుగా పెరిగిపోయి.. ఆ రాష్ట్రం కిందామీదా పడిపోతున్న సంగతి తెలిసిందే. అంతకంతకూ పెరిగిపోతూ.. సాధారణ వైద్యం కూడా కష్టంగా మారిన వేళ.. ముకేశ్ అంబానీ భారీ సాయాన్ని ప్రకటించారు.

తమ రిలయన్స్ రిఫైనరీలలో ఉత్పత్తి అయిన ఆక్సిజన్ ను ముంబయికి అందజేయనున్నట్ులగా ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద రిఫైనరీ ఇండస్గ్రీస్ గుజరాత్ లోని జామ్ నగర్ నుంచి ముంబయికి ఉచితంగా ఆక్సిజన్ ను పంపించనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని రిలయన్స్ ఉన్నతాధికారిక ఒకరు ప్రకటించారు.

గుజరాత్ లోని జామ్ నగర్ రిలయన్స్ సంస్థ నుంచి వంద టన్నుల ఆక్సిజన్ మహారాష్ట్రకు వస్తున్నట్లుగా ఆ రాష్ట్ర మంత్రి ఏకనాథ్ షిండే సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇదే సాయాన్ని ఇంతగా కేసులు ముదిరిపోయిన తర్వాత కంటే.. ముందే ప్రకటించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News