అంబానీ కొడుకు స్లిమ్ అయిపోయాడు

Update: 2016-03-20 07:45 GMT
బిజినెస్ టైకూన్ ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీని చూసే ఉంటారు. ఐపీఎల్ మ్యాచ్ ల్లో హల్ చల్ చేసే ఈ లేత వయసు కుర్రాడు భారీ ఆకారంతో ఉండేవాడు. సుమారు 140 కేజీల బరువుతో నానా ఇబ్బందులు పడేవాడు. ఉత్సాహవంతుడే అయినా ఐపీఎల్ మ్యాచ్ ల్లో తమ ముంబయి జట్టు ఫోర్లూ సిక్సులతో విరుచుకుపడుతుంటే ఉత్సాహపరిచేవాడు. అలాంటి అనంత్ శనివారం సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకోగా అక్కడ ఆయన్ను చూసినవారంతా షాకయ్యారట. ఎందుకంటే అదే ఫేస్ కట్... అదే హెయిర్ స్టైల్ - అదే గడ్డం... కానీ, మనిషి మాత్రం సగమైపోయాడు.  స్లిమ్ గా కనిపించడంతో ఆయనకేమైంది అని అంతా అనుకున్నారు. జనంతో పాటు మీడియా కూడా ఏంటీ మాయ అని ఆరా తీసేసరికి అసలు సంగతి తెలసింది. అధిక బరువుతో బాధపడుతున్న అనంత్ ఓ అమెరికన్ ట్రయినర్ సహాయంతో సగం బరువు తగ్గిపోయాడట.

అమెరికాకు చెందిన ఆ ట్రయినర్ సలహాలు కచ్చితంగా పాటించడంతో సాధారణ స్థితికి చేరుకున్నాడు. ఆ ట్రయినర్ సలహాలతోనే అనంత్ తమ జామ్ నగర్ రిలయన్సు రిఫైనరీలో రోజూ పదుల కిలోమీటర్లు పరుగులు తీశాడట ఈ మధ్య. అనంత్ బాబాయి అనిల్ అంబానీ కూడా తన యవ్వనంలో ఇలాగే హెవీ సైజ్ లో ఉండేవారన్న సంగతి గుర్తుండే ఉంటుంది.  ఆ తరువాత ఆయన కూడా పరుగులు తీసి, మారథాన్ పందేల్లో పాల్గొని కఠోర శ్రమతో ఫిట్ గా మారారు. ఇప్పుడు అనంత్ కూడా బాబాయి బాటలోనే సక్సెస్ సాధించారు.

Tags:    

Similar News