రిలయన్స్ ఫ్రీ ఫోన్ల ప్రకటన ముకేష్ అంబానీ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో ప్రభంజనంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ ఐఎల్) అధినేత ముకేష్ మరో రికార్డు క్రియేట్ చేశారు. ఆసియాలోని సంపన్నుల జాబితాలో ముకేశ్ రెండో స్థానానికి దూసుకెళ్లారు.
ఆ జాబితాలో రెండో స్థానంలో ఉన్న లీ కా షింగ్ ను ముకేష్ వెనక్కు నెట్టేశారు. బ్లూమ్స్‌బర్గ్ బిలియనీర్ నివేదిక ప్రకారం ఈ ఏడాది ముకేష్ అంబానీ రూ. 77000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు.
ఆసియా కుబేరుల జాబితాలో మొదటి స్థానాన్ని చైనాకు చెందిన అలీబాబా ఈ-కామర్స్ వెబ్‌సైట్ స్థాపకుడు జాక్ మా కైవసం చేసుకున్నారు. రెండో స్థానంలో అంబానీ, మూడో స్థానంలో హాంగ్ కాంగ్‌కు చెందిన పారిశ్రామిక వేత్త లీ కా షింగ్ ఉన్నారు. త్వరలో విడుదల కానున్న రిలయన్స్ ఫ్రీ ఫీచర్ ఫోన్ వల్ల వచ్చే ఏడాది ఆర్ ఐఎల్ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని బ్లూమ్స్‌బర్గ్ అభిప్రాయపడుతోంది.
జులై 21న జరిగిన ఆర్ ఐఎల్ వార్షిక సమావేశంలో జియో ను ఆర్ ఐఎల్ ము మణిహారంగా ముకేష్ పేర్కొన్నారు. త్వరలోనే దేశంలో అతిపెద్ద డేటా ప్రొవైడర్ గా జియో అవతరిస్తుందని ముకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. త్వరలో అందుబాటులోకి రానున్న రిలయన్స్ ఫ్రీ ఫీచర్ ఫోన్లతో రిలయన్స్ లాభాలు పెరుగుతాయని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.