బీజేపీకి భారీ షాక్.. ముకుల్ రాయ్ మళ్లీ టీఎంసీలోకి?

Update: 2021-06-11 11:30 GMT
పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి భారీ షాక్ తగులబోతున్నట్లు సమాచారం. ఆ పార్టీ కీలక నేత ముకుల్ రాయ్ మళ్లీ టీఎంసీలోకి చేరబోతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన ముకుల్ రాయ్ ఆర్భాటంగా బీజేపీలో చేరారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ లోని  కృష్ణనగర్ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గతంలో రాజ్యసభ ఎంపీగా, రైల్వేమంత్రిగానూ పనిచేశారు.

బీజేపీలోకి ముకుల్ రాయ్ చేరినప్పటికీ సువేందు అధికారి లాగా మమతా బెనర్జీపై పరుష విమర్శలు చేయలేదు. మమతతో సత్సంబంధాలు నెలకొల్పారు. ఇటీవల ముకుల్ రాయ్, ఆయన భార్య కరోనా బారినపడితే సీఎం మమతా బెనర్జీ, అభిషేర్ బెనర్జీ అండగా నిలిచారు. ఆయన కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మమతా బెనర్జీ అండగా నిలవడంతో ఆయన మనసు మారినట్లుగా తెలుస్తోంది.

ముకుల్ రాయ్ తన కుమారుడు సుభ్రాంగ్షు రాయ్ తోపాటు టీఎంసీలో శుక్రవారం చేరే అవకాశం ఉందని జాతీయ మీడియా చెప్తోంది. వీరిద్దరూ మమతా బెనర్జీతో శుక్రవారం మధ్యాహ్నం భేటి కాబోతున్నట్టు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వీరు మమత సమక్షంలో బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.
Tags:    

Similar News