దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. బయటకొస్తే చాలు అంటుకుంటోంది.ఇప్పటికే కేంద్ర హోంమంత్రి నుంచి రాష్ట్రాల మంత్రులు, సీఎంలు, అధికారులకు అందరికీ సోకింది. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి ఈ మహమ్మారి ఇంకా డేంజర్ అంటున్నారు.
తాజాగా కురువృద్ధుడు, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు తాజాగా ప్రకటించాయి.
ములాయం 70 ఏళ్లు దాటిన వృద్ధుడు కావడంతో సమాజ్ వాదీ పార్టీలో ఆందోళన మొదలైంది. ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు.తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని.. గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో ములాయంకు చికిత్స అందిస్తున్నట్లు అఖిలేష్ తెలిపారు.
అయితే ములాయంకు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా చెప్పారు. వైద్యులను సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నామని అఖిలేష్ యాదవ్ తెలిపారు.