ముంబై ఆల్ రౌండర్ దురుసు ప్రవర్తన... నెటిజన్ల ఫైర్

Update: 2021-05-03 01:30 GMT
భారత క్రికెట్ లో ఇప్పుడిప్పుడే ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంటున్న కృనాల్ పాండ్యా తోటి ఆటగాళ్లతో ప్రవర్తిస్తున్న తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది.  అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. కృనాల్  పాండ్యా  గతంలో పలువురు ఆటగాళ్ల పట్ల వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది.  తాజాగా కృనాల్ తన సహచర ఆటగాడు అంకుల్ రాయ్  పట్ల ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు భగ్గుమంటున్నారు.

 గురువారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై బ్యాటింగ్ చేస్తుండగా డికాక్, కృనాల్ క్రీజ్  లో  ఉన్నారు. స్ట్రై కింగ్ లో ఉన్న కృనాల్ పరుగు తీసే క్రమంలో బ్యాట్ ను క్రీజ్ లో పెట్టేందుకు కిందపడ్డాడు. దాంతో కృనాల్ మోచేతికి చిన్నపాటి గాయం అయింది. ఆ సమయంలో ముంబై ఆటగాడు అంకుల్ రాయ్ కృనాల్  పాండ్యా కోసం మాయిశ్చరైజర్ తీసుకొని మైదానంలోకి వచ్చాడు. కృనాల్ దానిని తనకు గాయమైన చోట రాసుకున్నాడు.

ఆ తర్వాత మాయిశ్చరైజర్ అంకుల్ రాయ్ కి తిరిగి ఇచ్చే క్రమంలో కృనాల్ దురుసుగా ప్రవర్తించాడు. మాయిశ్చరైజర్ అంకుల్ రాయ్ చేతికి ఇవ్వకుండా ముఖానికి విసిరేసినట్టుగా పడేశాడు. అయితే ఈ వ్యవహారం మొత్తం అక్కడి  సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.  ఈ తతంగం మొత్తం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు కృనాల్ పాండ్యా  వ్యవహరించిన తీరుపై ఫైర్ అవుతున్నారు. 'కృనాల్  నీ పద్ధతి మార్చుకోవాలంటూ ' కామెంట్స్ చేశారు. 'గతంలో దీపక్ హుడా పట్ల ఇలాగే వ్యవహరించావు.. ఇప్పుడు అంకుల్ రాయ్  పట్ల కూడా ఇలాగే చేశావు..  నువ్విక మారవా' అంటూ కామెంట్స్ చేశారు. అంతకుముందు కృనాల్  పాండ్యా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నిర్వహిస్తున్న సమయంలో దీపక్ హుడా పై దురుసుగా ప్రవర్తించి వివాదం రాజేశాడు. ఇప్పుడు మరోసారి అంకుల్ రాయ్ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో నెటిజన్లు కృనాల్ పై కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.
Tags:    

Similar News