మునుగోడు రిజ‌ల్ట్‌.. వైసీపీలో టెన్ష‌న్ ఎందుకు...!

Update: 2022-11-09 10:30 GMT
తెలంగాణ‌లోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక అనంత‌రం వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం పెరిగిపోయింది. ఇక్క‌డ టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అనేక రూపాల్లో సంక్షేమాన్ని అమ‌లు చేసింది. అనేక ప‌థ కాలు ప్ర‌వేశ పెట్టింది. ముఖ్యంగా ద‌ళిత బంధు, రైతు బంధు, క‌ళ్యాణ ల‌క్ష్మి వంటి కీల‌క ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టింది. ఇక‌, అభివృద్ధి విష‌యంలోనూ దూసుకుపోయారు. ఫ్లోరోసిస్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న న‌ల్ల‌గొం డ‌ను 'మిష‌న్ భ‌గీర‌థ‌' వంటి కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేశారు.

అంతేకాదు.. వివిధ ప‌థ‌కాల రూపంలో ప్ర‌జ‌ల‌కు రూ.కోట్ల పందేరం కూడా చేశారు. అయితే, అనూహ్యంగా ఇవేవీ ప‌నిచేయ‌లేదు. మునుగోడు ఉప ఎన్నిక స‌మ‌యంలో ఇలాంటివి ఎన్ని ప్ర‌చారం చేసినా.. ప్ర‌యోజ నం లేద‌ని స్ప‌ష్టమైంది. నిజానికి మునుగోడులో తొలి నెల‌లో జ‌రిగిన స‌ర్వేలో ఇదే విష‌యం స్ప‌ష్ట‌మైంది. దీంతో రంగంలోకి దిగిన కేసీఆర్‌.. డ‌బ్బుల అస్త్రాన్ని ప్ర‌యోగించారనే టాక్ వినిపించింది. ఓటుకు రూ.5 వేల చొప్పున పంచిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది.

ఈ క్ర‌మంలో దాదాపు వంద‌ల కోట్ల రూపాయ‌లు.. పందేరం చేయాల్సి వ‌చ్చింది. ఎన్నిక‌లకు ముందు చేప‌ట్టిన అభివృద్ధికి, సంక్షేమానికి వంద‌ల కోట్ల రూపాయ‌లు వెచ్చించి.. అప్పులు చేసి ఖ‌ర్చు చేసినా ఫ‌లితం రాలేదనే చ‌ర్చ సాగుతోంది.

ఇంత ఖ‌ర్చు చేసినా..  చ‌చ్చీ చెడీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌ను కూడా మోహ‌రించినా.. కేవ‌లం 10 వేల మెజారిటీతో తీవ్ర ఉత్కంఠ పోరు మ‌ధ్య విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇదంతా గ‌మ‌నిస్తున్న వైసీపీ నాయకులు ఇప్పుడు అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డారు.

ఏపీలోనూ అనేక కోట్లు అప్పులుగా తెచ్చి మ‌రీ సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక‌టి.. అన్న‌ట్టుగా సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నారు. అమ్మ ఒడి వంటి కార్య‌క్ర‌మాలు కూడా తెర‌మీదికి తెచ్చారు.

అయితే, ఇంత చేస్తున్నా.. మునుగోడు మాదిరిగా ఎన్నిక‌ల‌కు ముందు ప‌రిస్థితి యూట‌ర్న్ మారిపోతుందా? అనే చ‌ర్చ వైసీపీ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతోంది. దీనిపై ముందుగానే ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుని ఆదిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌నే డిమాండ్ వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News