అమెరికా కాంగ్రెస్ కు తొలి ట్రాన్స్ జెండర్.. ఎవరీ సారా?

కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటినుంచీ ట్రంప్ తన దూకుడు కొనసాగిస్తూ.. స్పష్టమైన మెజారిటీ దిశగా పరుగులు పెడుతున్నారు.

Update: 2024-11-06 06:50 GMT

అమెరికా అధ్యక్ష ఫలితాలు రసవత్తరంగా మారాయి. ఈ సమయంలో చాలా సర్వే ఫలితాలను తలకిందులు చేస్తూ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటినుంచీ ట్రంప్ తన దూకుడు కొనసాగిస్తూ.. స్పష్టమైన మెజారిటీ దిశగా పరుగులు పెడుతున్నారు.

ఇందులో భాగంగా... 11:45 ఏఎం (ఐ.ఎస్.టీ) సమయానికి 51.1 శాతం ఓట్లతో 247 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఇదే సమయంలో... డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ 47.4 శాతం ఓట్లతో 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఆ సంగతి అలా ఉంటే.. ఈ ఎన్నికల్లో యూఎస్ కాంగ్రెస్ కు తొలిసారిగా ట్రాన్స్ జెండర్ ఎన్నికయ్యారు.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా.. డెలవేర్ లోని ఎట్ లర్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన సారా మెక్ బ్రైడ్ విజయం సాధించారు. దీంతో... కాంగ్రెస్ కు ఎన్నికైన తొలి ట్రాన్స్ జెండర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజాగా జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ వేలెన్ - 3 పై పోటీ చేసిన సారా మెక్ బ్రైడ్ కు 95 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక జాన్ వేలెన్ కు 57.9 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సందర్భంగా స్పందించిన సారా... తాను కాంగ్రెస్ లో చరిత్ర సృష్టించడానికి రాలేదని.. డెలవేర్ లో మార్పు కోసమే పోటీ చేశానని తెలిపారు.

ఈ నేపథ్యంలో మనం పునరుత్పత్తి స్వేచ్ఛను రక్షించే దేశంగా ఉండాలని డెలవేర్ చాలా బిగ్గరంగా, స్పష్టంగా సంకేతాలు పంపిందని సారా తెలిపారు. ఇది మనందరికీ అతిపెద్ద ప్రజాస్వామ్యం అని సోషల్ మీడియాలో చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా... సారా మెక్ బ్రైడ్ ఎల్.జీ.బీ.టీ.క్యూ జాతీయ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల సమయంలో సుమారు 3 మిలియన్ డాలర్లకు పైగా ప్రచార విరాళాలు సేకరించారు. 2020లో డెలవేర్ లో తొలి ట్రాన్స్ స్టేట్ సెనెటర్ గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు.

Tags:    

Similar News