వెండితెర మీద వెలిగిపోయి తర్వాతి కాలంలో రాజకీయాల్లోకి రావటం చాలామంది చేసేదే. కానీ.. సీనియర్ నటుడు కమ్ పార్ట్ టైం రాజకీయ నేత ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ అయిన మురళీమోహన్ ముచ్చట కాస్త భిన్నం. ఆయన వ్యాపారాలు.. సంపద చాలావరకూ హైదరాబాద్‌లోనే ఉంటుంది. కానీ.. ఆయన బరిలోకి దిగేది మాత్రం రాజమండ్రి నుంచే. ప్రాణం హైదరాబాద్ లో.. రాజకీయాలు చేసేది మాత్రం రాజమహేంద్రవరం అంటూ ఆయన చెప్పే మాటలకు ఆంధ్రోళ్లు ఎప్పటికప్పుడు రాజీ పడతారు.
ఏమయ్యా పెద్ద మనిషి.. నీకన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా? నువ్వు ప్రాతినిధ్యం వహించే రాజమహేంద్రవరంలో ఏదైనా మంచి ప్రాజెక్టు స్టార్ట్ చేయొచ్చుగా? అన్న ప్రశ్నను వేసినోడు ఉండడు. అంతదాకా ఎందుకు.. మురళీమోహన్ గారి వ్యాపార సామ్రాజ్యానికి చెందిన రిజిస్టర్ సంస్థను రాజమహేంద్రం పేరిట రిజిస్టర్ చేయించినా ఏపీకి ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుంది.
కానీ.. ఇలాంటివేమీ చేయని ఆయన.. ఆ మధ్యన ఢిల్లీలో.. ఏమండి.. నాకో ఐదారు కేజీలు తగ్గాలనుకుంటున్నా.. ఏదైనా దీక్ష ఉంటే చెప్పండంటూ చేసిన ఎటకారం బుజ్జి వీడియోలో వైరల్ అయి.. మురళీ మోమన్ మీదున్న గౌరవ మర్యాదలు మన్నులో కలిసేలా చేశాయన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. తాజాగా ఆయనో సిత్రమైన మాటను చెప్పారు. ఎప్పటిలానే.. జాగ్రత్తకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆయన.. తాను చెప్పేది వ్యక్తిగత అభిప్రాయంగా వెల్లడించారు. ఇంతకీ ఆయన చెప్పాలనుకుంటున్న మాటేమిటంటారా? రెండు తెలుగు రాష్ట్రాల చంద్రుళ్లు కలిస్తే దుమ్ము దుమ్మేనని తేల్చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల చంద్రుళ్లు చేతులు కలిపి ఎన్నికల బరిలోకి దిగితే.. భారీ సీట్లు తమ సొంతమవుతాయని.. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వాలకు తాము కీలకంగా మారతామని ఆయన వ్యాఖ్యానించారు. ఉన్నట్లుండి మురళీమోహన్ మాష్టారికి ఇలాంటి సిత్రమైన ఆలోచనలు ఎందుకు వచ్చాయంటారా?.. ఎంతైనా.. తన వ్యాపార సామ్రాజ్యానికి మూలమైన హైదరాబాద్ లో ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంటే అదో హాయిగా ఉంటుంది కదా?
ఇద్దరు చంద్రుళ్లు కలవాలన్న మాటను మురళీమోహన్ నోటి నుంచి ఎలా వచ్చిందో అర్థం కాని పరిస్థితి. మొన్నటికి మొన్న సొంత పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మద్దతు ఇవ్వకపోవటమే కాదు.. ప్రత్యేక హోదాకు గండి కొట్టేలా వరుస ప్రకటనలు చేస్తున్న వేళ.. కొత్త చుట్టరికం కోసం మురళీమోహన్ మది పడుతున్న తహతమ పలువురికి ఒళ్లు మండేలా చేయటమే కాదు.. తమ్ముడికి సిగ్గు అన్న పదార్థం ఉండదా? అన్న ఆగ్రహాన్ని పలువురు ఆంధ్రోళ్లు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రజల ప్రయోజనాల మీద ఎలుగెత్తమని ఎంపీని చేస్తే.. ఆ పని వదిలేసి.. ఇలా ఇద్దరు చంద్రుళ్లు కలిసిపోవాలన్న ఆలోచనలు చేయటం ఏమిటి మురళీమోహన్ సారూ?