కర్ణాటకలో రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా మారింది. నాటకీయ పరిణామాల మధ్య ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు పలువురు తమ పదవులకు రాజీనామా చేయటం.. తాజాగా వాటి భర్తీకి ఉప ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయం రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పేందుకు అవకాశం కల్పించనుంది. దీంతో.. ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు పార్టీలు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
ఇలాంటివేళ చాలాచోట్ల బీజేపీ - జేడీఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ తరహా ఉదంతంపై మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ్ మనమడు సూరజ్ రేవణ్ణపై హత్యాయత్నం కేసు నమోదు కావటం సంచలనంగా మారింది. కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ కుమారుడే ఈ సూరజ్.
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేస్తున్నారని జేడీఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ.. జేడీఎస్ కార్యకర్తలకు జరిగిన గొడవలో సూరజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. తమపై దాడి చేసి గాయపర్చారంటూ జేడీఎస్ నేతలపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో.. మాజీ ప్రధాని మనమడిపై హత్యాయత్నం కేసు పెట్టారు.