ఇన్సూరెన్స్ మనీ కోసం ప్రవాస భారతీయుడి హత్య

Update: 2022-02-11 04:31 GMT
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రజలు హత్యలకు గురికావడం చాలా ఇంగ్లీష్,హిందీ చిత్రాలలో చూశాం. కానీ ఇది నిజ జీవితంలోనూ తాజాగా జరిగింది.. బాధితులు మరెవరో కాదు.. కాలిఫోర్నియాకు చెందిన డొమినిక్ సర్కార్ అనే భారతీయ అమెరికన్ చెఫ్.

అక్కడి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. డొమినిక్ సర్కార్ భాగస్వామి అయిన మారియా మూర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మార్వెల్ సాల్వంత్ అనే వ్యక్తి చేత సర్కార్ ను హత్య చేసింది. ఆమె $ 800, 000 డాలర్ల విలువైన డొమినిక్  బీమా డబ్బుల కోసం ఇదంతా చేసినట్టు తేలింది.

ఈ బీమా సర్కార్ పై చేసిన మారియా.. లబ్ధిదారుగా తన పేరును పెట్టుకుంది. ఈ క్రమంలోనే డబ్బు కోసం ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. తన భాగస్వామిని హత్య చేసింది.

కాలిఫోర్నియాలోని అల్మెడ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం  న్యాయమూర్తులు మరియా మూర్ మరియు మార్వెల్ సాల్వాంట్‌లను హత్యకు పాల్పడ్డారని తేల్చారు..
 
అక్టోబర్ 2018లో హత్యకు ముందు మూర్ సాల్వంత్‌కు ఒక నెల కంటే తక్కువ $500 డాలర్ల వేతనం చెల్లించింది. అతనికి భారీ మొత్తాన్ని ఇస్తానని కూడా వాగ్దానం చేసింది. అయితే ఈ హత్యను సెల్‌ఫోన్ సాక్ష్యం పట్టించింది.

సాల్వంత్ సర్కార్ ను తానే హత్యకు పాల్పడినట్లు విచారణలో మారియా అంగీకరించింది. దీంతో ఆమెకు కోర్టు శిక్షను మార్చి 9న ఖరారు చేసింది.
Tags:    

Similar News