విలక్షణ సంస్కృతీ సంప్రదాయాలకు నెలవైన అలహాబాద్ పేరు చెబితే చాలా మందికి నెహ్రూ - ఇందిర - అమితాబ్ బచ్చన్ - హరిప్రసాద్ చౌరాసియాలతో పాటు మురళీ మనోహర్ జోషి పేరు కూడా గుర్తుకు వస్తుంది. అలాంటి కర్మభూమిలో - సొంత పార్టీ నేతల చేతిలోనే మురళీ మనోహర్ జోషి అవమానానికి గురయ్యారు . 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక వ్యూహ రచన చేసేందుకు బీజేపీ అలహాబాద్ లో జాతీయ కార్యనిర్వాహక వర్గ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా - కేంద్ర సీనియర్ మంత్రులు - బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు - ఎంపీలు - ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇంతటి కీలక సమావేశానికి కురువృద్ధుడు మురళీ మనోహర్ జోషిని పిలవకపోవడంపై అలహాబాద్ లోని ఆయన అనుచరగణం భగ్గుమంటోంది.
సమావేశానికి వచ్చే నాయకులకు స్వాగతం తెలుపుతూ యూపీ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లోనూ జోషి ఫోటో ఎక్కడా కనిపించకపోవడం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. అద్వానీ - వాజపేయి ఫోటోలు కూడా ఏక్కడో గానీ కనబడలేదట. 'జోషి గారు రెండు రోజులుగా అలహాబాద్ లోనే ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు రమ్మని ఏ ఒక్కరూ ఆయనను పిలవలేదు. ఇది జోషిని అవమానించినట్లు కాదా? ఇలాంటి చర్యల ద్వారా ఇప్పుడు ఉన్న నాయకులు ఏం చెప్పదలుచుకుంటున్నారు?' అంటూ మీడియా ముందు జోషి అనుచరులు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. తమ నాయకుడికి జరిగిన అవమానంపై పార్టీ సమావేశాల్లో నిలదీస్తామని అంటున్నారు.
పార్లమెంట్లో రెండు సీట్లతో ప్రారంభమై - మూడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టగలిగే స్థాయిలో భారతీయ జనతా పార్టీని నిలిపిన మూడు స్తంభాల్లో ఒకరు మురళీ మనోహర్ జోషి. మిగతా ఇద్దరు అటల్ బిహారీ వాజపేయి - ఎల్ కే అద్వానీ అనే సంగతి తెలిసిందే. చివరి ఇద్దరి కంటే భిన్నంగా మనోహర్ జోషి ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదులుకొని పార్టీ ఉన్నతికి కృషి చేశారు. జోషి పుట్టింది నైనిటాల్లోనే అయినప్పటికీ అలహాబాద్ యూనివర్సిటీలో ఆయన జీవితం మలుపు తిరిగింది. విద్యార్థిగా ప్రవేశించి - పీహెచ్ డీ పూర్తి చేసి, వర్సిటీలోనే ప్రొఫెసర్ గా కెరీర్ ప్రారంభించారు. అలహాబాద్ నుంచి మూడు సార్లు పార్లమెంట్‌కు ఎన్నికైన మనోహర్ జోషి 2009లో వారణాసి నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన కాన్పూర్ ఎంపీగా కొనసాగుతున్నారు. సంఘ్ నిర్దేశకత్వంలో మోడీ-షా ద్వయం నడిపిస్తున్న బీజేపీలో సీనియర్లకు ప్రాధాన్యం ఎప్పుడో తగ్గిపోయిందని, 'కాంగ్రెస్ ముక్త్ భారత్' పిలుపు ఇచ్చిన పార్టీ 'కాంగ్రెస్ యుక్త్'లా మారిపోయిందని పార్టీ సీనియర్లు వాపోతున్నారు.